Visakhapatnam: విశాఖ జిల్లా పెందుర్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన పై చిరాకు పడుతుందని అత్తను హత్య చేసింది ఓ కోడలు. పోలీసులు సమాచారం ప్రకారం.. అత్త కనకమహాలక్ష్మి, కోడలు లలితపై తరచూ చిరాకుపడుతుందనే కారణంతో.. అత్తను చంపటం కోసం దొంగ- పోలీస్ ఆటను ఎంచుకుంది. మనవరాలితో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడాలని అత్తను ఓ కుర్చీలో తాళ్లతో కట్టి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం అత్త పై పెట్రోల్ పోసి దేవుడి గదిలోని దీపం తీసుకొని వచ్చి అత్తపై విసిరింది. కుర్చీలో తాళ్లతో బంధించి ఉండటంతో ఆ మంటలలో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కోడలు లలిత అగ్నిప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి వారి శైలిలో విచారణ చేపట్టగా కోడలే చంపిందని తేల్చారు.