CM Chandrababu: టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబు శనివారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత కార్యక్రమాల్లో 48 మంది ఎమ్మెల్యేలు యాక్టివ్ గా పొల్గొనడం లేదని సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ 48 మంది ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరాగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలన్నారు. పెన్షన్ల పంపిణీ తర్వాత కార్యకర్తలు, ప్రజలతో ఎమ్మెల్యేలు మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొని తీరాల్సిందేనని సీఎం ఆదేశించారు. సీన్సియర్‌గా పనిచేసిన కార్యకర్తలను కలుపుకెళ్లాలన్నారు.
Also Read: CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే
నియోజకవర్గ టీడీపీ ఆఫీసుల్లో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలు ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో పాల్గొనకపోతే టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వివరణ తీసుకోవాలన్నారు. అలాగే ఎమ్మెల్యేల వ్యవహారాన్ని తన దృష్టికి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితులు, నిధుల కొరతపై ప్రజలను చైతన్యవంతం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.