Ajay Bhupathi : ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. కార్తికేయ గుమ్మకొండ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా సక్సెస్ సాధించిన వెంటనే శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మహాసముద్రం అనే సినిమా తెరకెక్కించాడు. అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. ఆ సినిమా సిద్ధార్థ కు మంచి కం బ్యాక్ అవుతుంది అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
సినిమా మొదటి షో పడినప్పుడు నుంచి నెగిటివ్ టాక్ వచ్చేసింది. కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మంగళవారం అనే సినిమాను చేశాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అజయ్ భూపతి ఈ సినిమాతోనే ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు అప్పట్లో అనౌన్స్ చేశారు. ఇక ప్రస్తుతం అజయ్ భూపతి ఘట్టమనేని జయకృష్ణను ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా మొదలవుతుంది. అజయ్ భూపతి చేస్తున్న నాలుగవ సినిమా ఇది. సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి శ్రీనివాస్ మంగాపురం అనే టైటిల్ను ఖరారు చేసినట్లు విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.
మంగళవారం సినిమా తర్వాత రా అజయ్ భూపతి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో వస్తుండడంతో సూపర్ స్టార్ అభిమానులకు కూడా ఏదో ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి.
మంగళవారం సినిమా సక్సెస్ సాధించిన కారణంగా శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ కూడా దీంట్లో ఇరికించాడేమో అని ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇది అజయ్ భూపతి సెంటిమెంట్ అని సోషల్ మీడియాలో అక్కడక్కడ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గతంలో అజయ్ భూపతి నాగచైతన్య, రవితేజ వంటి హీరోలతో కూడా సినిమా సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అని కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. ఇక డెబ్యూ హీరో కి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాడో వేచి చూడాలి. కార్తికేయ గుమ్మకొండ కు డెబ్యూ సినిమాతోనే బ్లాక్బస్టర్ సక్సెస్ అందించాడు.
Also Read: Thiruveer : సక్సెస్ అవ్వకుండానే సెలబ్రేషన్ చేస్తారు.. నిర్మాతలపై హీరో సెటైర్