Ahmedabad Plane Crash
ఆహ్మదాబాద్ నగరంలోని సరదార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర విషాద సంఘటన గురువారం జరిగింది.
Ahmedabad Plane Crash
లండన్ గాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 (Boeing 787 Dreamliner) టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మేఘాణీనగర్ సమీపంలో కుప్పకూలింది.
Ahmedabad Plane Crash
ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే భారీ మంటలు, పొగలు ఎగసిపడడంతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.
Ahmedabad Plane Crash
ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు, 53 బ్రిటిష్ పౌరులు, మిగిలిన వారు ఇతర దేశాలకు చెందినవారు.
Ahmedabad Plane Crash
ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం టేకాఫ్ అయిన 3 నిమిషాలకే మేడే సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు.
Ahmedabad Plane Crash
ఆ తరువాత కాస్త వ్యవధిలో రాడార్ కనెక్షన్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే బర్డ్ హిట్, ఇంజిన్ ఫెయిల్యూర్ వంటి అంశాలు ప్రాథమిక విచారణలో ఉన్నట్లు సమాచారం.
Ahmedabad Plane Crash
ప్రమాదాన్ని కళ్లారా చూసిన స్థానికులు వణికిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకొని రక్షణ చర్యలు ప్రారంభించాయి. విమానాశ్రయంలోని ఇతర విమానాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
Ahmedabad Plane Crash
భారత ప్రభుత్వం అత్యవసర సమీక్ష నిర్వహిస్తూ బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తున్నట్టు వెల్లడించింది.
Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash
ఇది దేశానికి చెందిన విమానయాన చరిత్రలో మరో బాధాకర అధ్యాయంగా నిలవనుంది. అయితే విమాన ప్రమాదంలో ఎంత మందికి గాయాలయ్యాయో, ఎంత మంది మృతి చెందారో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.