Black Tea vs Black Coffee: చాలామందికి ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు కాఫీ తాగనిదే ఆ రోజు గడవదు. కొందరు టీ తాగడానికి ఇష్డపడితే.. మరికొందరు కాఫీ తాగాలనుకుంటారు. ఉదయం పూట టీ/కాఫీ అనేది మనిషి జీవితంలో భాగం అయిపోయింది. అందుకే చాలామంది వాళ్లకి అనిపించినప్పుడంతా కప్పులు కప్పులు లాగించేస్తుంటారు. అయితే, కొందరు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీలను కూడా తీసుకుంటుంటారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే, చాలామందిలో బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీలో ఏది ఆరోగ్యానికి మంచిది అనే డౌట్ ఉంటుంది. రండి మరి.. ఈ రెండింటో ఆరగ్యోనికి ఏది మంచిదో తెలుసుకుందాం..
బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ.. రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది. అలసట, ఒత్తిడిగా అనిపించినప్పుడు బ్లాక్ టీ తీసుకుంటే.. తక్షణ ఉపశమనం లభిస్తుంది. కానీ, మొత్తంలో గణనీయమైన తేడా కూడా ఉంటుంది. ఇక బ్లాక్ కాఫీలో ఎక్కువ కెఫిన్ కంటెంట్ ఉండటం వల్ల.. దీన్ని తాగిన వెంటనే తక్షణ శక్తి లభిస్తుంది. ఈ డ్రింక్ జిమ్‌కు వెళ్లేవారికి లేదా ఏదైనా శారీరక శ్రమ చేసేవాళ్లు తీసుకోవచ్చు. అయితే, అధిక కెఫిన్ కంటెంట్ కొంతమందిలో ఆమ్లత్వాన్ని కలిగించే ఛాన్స్ ఉంది. ఇక బ్లాక్ టీలో కాఫీ కంటే తక్కువ కెఫిన్ ఉంటుంది. టీలో L-థియనిన్ అనే సమ్మేళనం ఉంటుంది కాబట్టి.. ఇది ఉత్తేజపరిచే ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. దీంతో ఇది క్రమంగా దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది.
బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు అధికమే. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. బ్లాక్ కాఫీ తాగడం వల్ల జీవక్రియ వేగం పెరుగుతుంది. ఇది అధిక బరువును కూడా నియంత్రించగలదు. బ్లాక్ కాఫీ గుండె, కాలేయ ఆరోగ్యానికి మంచి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది మానసిక స్థితిని సైతం మెరుగుపరుస్తుంది. ఇకపోతే.. బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్లు, థియఫ్లావిన్లు వంటి ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కాఫీ కంటే అద్భుతంగా పనిచేస్తుంది.
బ్లాక్ టీ, బ్లాక్ కాపీలలో ఆరోగ్యానికి ఏది మంచిదో పూర్తిగా మన అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కఠినమైన వ్యాయామం చేయడానికి ముందు చురుగ్గా ఉండేందుకు, ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలంటే బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు ఉంటే, బ్లాక్ కాఫీకి దూరంగా ఉండాలి. ఎక్కువ కెఫిన్ కంటెంట్ నియంత్రించాలనుకుంటే.. గట్ హెల్త్ కోసం బ్లాక్ టీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.