Kannappatrailer launch Event: మంచు విష్ణు (Manchu Vishnu)హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప ఈ సినిమా కోసం మంచు విష్ణు దాదాపు పది సంవత్సరాలు పాటు ఎంతో కష్టపడుతున్నట్లు తెలియజేశారు. భక్తకన్నప్ప అనే వ్యక్తి శివయ్య పై తనకున్నటువంటి భక్తిని ఎలా చాటి చెప్పారో అనే కథ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మంచు మనోజ్ దాదాపు పది సంవత్సరాల పాటు పనిచేస్తూ వస్తున్నారని ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
వాయిదా పడిన ట్రైలర్ లాంచ్..
ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక చిత్ర బృందం ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలలో కూడా పర్యటిస్తూ అక్కడ ప్రమోషన్లను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే రేపు ఇండోర్ లో జరగాల్సిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఈవెంట్ వాయిదా పడటంతో ఒక్కసారిగా అభిమానులు అదరూ షాక్ లో ఉండిపోయారు కానీ మంచు విష్ణు తీసుకున్నటువంటి నిర్ణయం పై అందరూ ప్రశంశలు కురిపిస్తున్నారు.
విమాన ప్రమాదం…
అసలు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వాయిదా పడటానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది. ఇలాంటి ఒక దుర్ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో మంచు విష్ణు తన సినిమా వేడుకను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.
My heart breaks for the lives lost in today’s Ahmedabad Air India crash. In deep mourning, we’re deferring the #Kanappa trailer release by one day and canceling tomorrow’s Indore pre‑release event. My prayers are with the families during this unimaginably difficult time. 💔
— Vishnu Manchu (@iVishnuManchu) June 12, 2025
ఇలా ఈ విషయం గురించి మంచు విష్ణు అధికారికంగా తన సోషల్ మీడియా వేదికగా కూడా తెలియజేశారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ విమాన ప్రమాద ఘటన చాలా బాధాకరం అని తెలిపారు. ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాధ నా హృదయాన్ని కలచివేసింది. ఇలాంటి పరిస్థితులలో కన్నప్ప సినిమా ట్రైలర్ మరొక రోజుకు వాయిదా పడిందని తెలియజేశారు. ఇలాంటి కష్ట సమయాలలో నా ప్రార్థనలు ఆ కుటుంబానికి ఉండాలి అంటూ మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ట్రైలర్ వాయిదా పడిందని తెలియజేయడమే కాకుండా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా మంచు విష్ణు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.