BigTV English
Advertisement

SSMB29: ఎట్టకేలకు రాజమౌళి-మహేష్‌ మూవీ నుంచి అప్‌డేట్‌.. పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

SSMB29: ఎట్టకేలకు రాజమౌళి-మహేష్‌ మూవీ నుంచి అప్‌డేట్‌.. పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

SSMB29 Prithviraj Sukumaran First Look: ఎట్టకేలకు రాజమౌళి, మహేష్‌ మూవీ నుంచి ఒక ఆఫీషియల్‌ అప్‌డేట్‌ వచ్చింది. మూవీ టీం తాజాగా ఈ సినిమాలోని కీలక పాత్ర ఫస్ట్‌లుక్‌ ఇచ్చేసింది. అదే పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఫస్ట్‌లుక్‌. కాగా దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌ పాన్‌ వరల్డ్‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్‌ టైటిల్‌ తో ఈ సినిమా రూపొందుతోంది. మూవీ ప్రకటన నుంచి షూటింగ్‌ వరకు ఇప్పటి వరకు ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వలేదు. పూజ కార్యక్రమాన్ని కూడా సైలెంట్‌గానే జరిపించారు.


ఎట్టకేలకు ఫస్ట్ లుక్

షూటింగ్‌ని కూడా కట్టదిట్టమైన భద్రత మధ్య సీక్రెట్‌గా కానిచ్చేస్తున్నారు.  షూటింగ్‌ ఎలా జరుగుతుంది, ఎన్నో షెడ్యూల్‌కి చేరుకుంది లాంటి ప్రకటన కూడా లేదు. కనీసం మహేష్‌ లుక్‌ కూడా బయటకు రాకుండ జాగ్రత్త పడుతున్నారు. అయితే మహేష్‌ బర్త్‌డే అయిన ఫస్ట్‌ లుక్‌ వస్తుందనుకుంటే గ్లోబల్‌ ట్రోటర్‌ (GlobeTrotter) పేరుతో సెమి లుక్‌ని విడుదల చేశారు. బాడీ, మెడలోని ఓ పెండెంట్‌ మాత్రమే చూపించి మరింత ఆసక్తి పెంచారు. ఫుల్‌ లుక్‌ ఎప్పడెప్పుడు వస్తుందా అని అంత ఆశగా వెయిట్‌ చే స్తున్నారు. నవంబర్‌ 15న ఈ సినిమా నుంచి మహేష్‌ లుక్‌తో పాటు టైటిల్‌ని ప్రకటించనున్నారు.  ఈ ఈవెంట్‌కి రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికగా కానుంది.

సుకుమారన్ లుక్ వచ్చేసింది

ఈ ఈవెంట్‌ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ బిగ్‌ అప్‌డేట్‌ కోసం సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అంత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. నవంబర్‌ 15 ఎప్పుడెప్పుడు వస్తుందా? కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దీనికి అభిమానులు మాత్రమే కాదు సినీ పరిశ్రమ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ బిగ్‌ అప్‌డేట్‌ ఇంకా వారం రోజులే ఉంది. ఇప్పటి నుంచే గ్లోబల్‌ ట్రోటరిని సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌ లుక్‌తో అప్‌డేట్స్‌ మొదలుపెట్టింది మూవీ టీం. సినిమాలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఫస్ట్‌లుక్‌ని కాసేపటి క్రితం అధికారికంగా విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఆయన కుంభ పాత్రలో కనిపించబోతున్నారు.


క్రూరమైన విరోధి కుంభ

ఇందులో విలన్ వీల్‌ చైర్‌లో కూర్చోని కనిపించాడు. మొత్తం రోబోతో డిజైన్‌ చేసిన ఈ చైర్‌ సాయంతో కుంభ భారీ ఫైట్ సీన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. వీల్ చైర్ ఉన్న విలన్‌ మాత్ర పవర్ఫుల్‌ లుక్‌లో కనిపించాడు. ఆయన లుక్ ని షేర్ చేస్తూ రాజమౌళి పృథ్వీరాజ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. “”పృథ్వీతో మొదటి షాట్‌ తర్వాత ఆయన దగ్గరి వెళ్లాను. నేను చూసిన అత్యత్తుమ నటుల్లో మీరు ఒకరు. ఈ దుష్ట, శక్తవంతమైన, క్రూరమైన విరోధి కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంత్రప్తికరంగా ఉంది. థ్యాంక్యూ పృథ్వీ” అని రాజుకొచ్చారు. ప్రస్తుతం ఈ లుక్‌ మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకుంది. విలన్‌ ఇలా చూపించారంటే జక్కన్న మరేదో స్పెషల్‌ ప్లాన్‌ చేశాడని, సినిమాలో ఆయన విజన్‌ని అంచన వేయలేం అంటున్నారు. SSMB29 నుంచి వచ్చని మొదటి ఆఫీషియల్‌ ప్రకటన కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

Related News

Vrusshabha Release: మోహన్ లాల్ వృషభ కొత్త రిలీజ్ డేట్… టార్గెట్ క్రిస్మస్‌

Mammootty: అరుదైన గౌరవం దక్కించుకున్న మమ్ముట్టి మూవీ!

HBD Anushka: 20 ఏళ్ల సినీ కెరియర్ లో అనుష్క ఆస్తులు ఎన్ని కోట్లంటే?

Priyanka Chopra: హీరోయిన్ గారి ఖర్చే కోట్లలో ఉందంట.. అయినా జక్కన్న మౌనం.. కారణం ఏంటి..?

Rashmika Mandanna: విజయ్.. కచ్చితంగా నువ్వు నన్ను చూసి గర్వపడతావ్

Peddi: చికిరి చికిరి సాంగ్ వచ్చేసిందోచ్.. లిరికల్ కాదు ఏకంగా వీడియోనే.

Katrina Kaif: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రీనా

Big Stories

×