Priyanka Chopra: ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న SSMB29 అప్డేట్స్ రావడం మొదలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచు పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కుంభా అనే క్రూరమైన విలన్ గా పృథ్వీరాజ్ కనిపించనున్నాడు. ఇక త్వరలోనే ప్రియాంక చోప్రా లుక్, మహేష్ బాబు లుక్ తో పాటు గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కేవలం టాలీవుడ్ మాత్రమేకాకుండా ప్రపంచం మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంది. దాదాపు వెయ్యి కోట్లు ఈ సినిమా కోసం ఖర్చుపెడుతున్నారని టాక్. దీనికోసం జక్కన్న టాప్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి స్టార్ క్యాస్టింగ్ కూడా టాప్ లో ఉండేలానే చూస్తున్నాడట. అందుకోసమే గ్లోబల్ బ్యూటీ, అమెరికా కోడలు అయినటువంటి ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. హీరో కన్నా హీరోయిన్ కోసమే కోట్లు ఖర్చుపెడుతున్నాడట జక్కన్న. సాధారణంగా హీరో రెమ్యూనరేషన్.. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ, ఇక్కడ మహేష్ కన్నా ఎక్కువ ప్రియాంక కోసమే జక్కన్న ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ లోకల్.. హైదరాబాద్ లోనే ఉంటాడు కాబట్టి.. సొంత కారులోనే లొకేషన్ కు వచ్చేస్తాడు.. ప్రమోషన్స్ కు వచ్చేస్తాడు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పక్కనే ఉన్న కేరళనే కాబట్టి అంత ఖర్చు ఉండదు. ఎక్కడ షూటింగ్ అంటే అక్కడ.. ఫ్లైట్ లో వచ్చి వాలిపోతాడు.
వీరిద్దరిలా కాదు ప్రియాంక. నిక్ జోనాస్ ను వివాహాం చేసుకున్నాకా అమెరికాలో స్థిరపడింది. ఇక మాల్తీ పుట్టాకా అసలు ముంబైలో కనిపించడం కూడా మానేసింది. అలాంటి ఈ చిన్నదాని SSMB29 కి హీరోయిన్ గా ఎంపిక చేయడంతో చిన్నదానికి, పెద్దదానికి అమ్మడు అమెరికా నుంచి రావాల్సి వస్తుంది. చిన్న ఈవెంట్ ఉంటే రావాలి, షూటింగ్ హైదరాబాద్ లో ఉంటే రావాలి. ఇలా ప్రతిదానికి ఫ్లైట్ ఖర్చులు అన్ని జక్కన్ననే భరించాలి. అంతేనా.. ఆమె వసతులు, హోటల్ ఖర్చులు అన్ని ఆయనే చూసుకోవాలి. ఇలా ప్రియాంకకే కోట్లల్లో ఖర్చు అవుతుందట.
అంత ఖర్చు అయినా కూడా జక్కన్న మౌనం వహించడానికి కారణం.. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా మాత్రమే కాదు పాన్ వరల్డ్ కాబట్టి. గ్లోబల్ గా ఈ సినిమాను ఒక రేంజ్ లో నిలబెట్టాలని చూస్తున్నాడు కాబట్టి ఎంత ఖర్చుపెట్టినా దానికి తగ్గ ప్రతిఫలం వస్తే చాలు అనుకుంటున్నాడట. అందుకే వెయ్యి కోట్ల బడ్జెట్ లోకొంత ప్రియాంకకు ఖర్చుపెట్టినా తప్పులేదని భావిస్తున్నాడట. అందుకే ప్రియాంక.. పక్కనే ఉన్న ఊరు వెళ్లినట్లు అమెరికా టూ హైదరాబాద్ ట్రావెల్ చేస్తుంది. మరి ఈ సినిమా తో రాజమౌళి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.