Vivo X300 ultra dual 200MP cameraphone| ప్రముఖ స్మార్ట్‌ఫోన్ చైనా కంపెనీ వివో ఒక కొత్త ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తోంది. వివో X300 సిరీస్ లో భాగంగా త్వరలో విడుదల కాబోతున్న వివో X300 అల్ట్రా మోడల్ ని అసాధారణ కెమెరా సిస్టమ్ తో ప్రజల ముందుకు తీసుకురానుంది. ఇందులో 400MP కెమెరా లెన్సులు అంటే ప్రపంచంలో మొదటిసారిగా రెండు 200MP కెమెరాలను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ని ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ ప్రియుల కోసం రూపొందించారు. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని మరో మెట్టు పైకి తీసుకురావాలనే లక్ష్యంగా ఈ డివైస్‌ని తయారు చేసింది వివో.
ఈ ఫోన్‌లో మూడు రెయర్ (వెనుక భాగం) కెమెరాల సిస్టమ్ ఉంటుంది. వాటిలో రెండు సెన్సర్లు 200MP రిజల్యూషన్‌తో ఉంటాయి. ఈ టెక్నాలజీ ఫోటోగ్రఫీ పరంగా అత్యంత పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌గా మారుస్తుంది. ప్రధాన లెన్స్ స్ట్రీట్ ఫోటోగ్రఫీకి ఉపయోగపడుతుంది. కానీ f/1.8 వేగవంతమైన లెన్స్ పోర్ట్రెయిట్‌లు, రోజువారీ దృశ్యాలను డెప్త్, కాంట్రాస్ట్‌తో అద్భుతంగా చూపిస్తుంది.
ఈ ఫోన్ దీని మునుపటి మోడల్‌కు పెద్ద అప్‌గ్రేడెడ్ వెర్షన్. వివో X200 అల్ట్రాలో ఒక్క 200MP టెలిఫోటో కెమెరా, ప్రైమరీ సెన్సర్ 50MP మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు X300 అల్ట్రాలో డ్యూయల్ 200MP వ్యవస్థ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో ఎన్నడూ చూడని విధంగా డీటెయిల్స్ ఇస్తుంది. అయితే దీని ధర కూడా గణనీయంగా పెరుగుతుంది.
ఈ డివైస్ మొదట చైనాలో విడుదలవుతుంది. 2026 రెండవ త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అంచనా. గ్లోబల్ మార్కెట్లకు ఆ తర్వాత వస్తుంది. మోడల్ నంబర్ V2562తో గ్లోబల్ వేరియంట్ టెస్టింగ్ ఇప్పటికే మొదలైంది.
X300 అల్ట్రాలో 6.8 ఇంచ్ OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇందులోని స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఏ పనికైనా గొప్ప పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ 16పై వివో కస్టమ్ ఒరిజిన్OS 6 ఇంటర్‌ఫేస్ ఉంటుంది.
X300 అల్ట్రా ప్రీమియం డివైస్. ధర మునుపటి మోడల్స్‌కు మించి ఉంటుంది. భారత్‌లో వివో X200 ప్రో రూ.94,999తో విడుదలైంది. అల్ట్రా మోడల్స్ సాధారణంగా చైనాకు మాత్రమే పరిమితం. కానీ X300 అల్ట్రా విషయంలో వివో తన మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చవచ్చు.
ఈ ఫోన్.. ఫోటోగ్రఫీ ప్రియులను టార్గెట్ చేస్తుంది. ఇతర కెమెరా-ఫోకస్డ్ ఫ్లాగ్‌షిప్‌లతో పోటీ పడుతుంది. డ్యూయల్ 200MP సిస్టమ్ ఇందులో ప్రధాన ఆకర్షణ. వివో మొబైల్ ఫోటోగ్రఫీ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉండాలని ఆశిస్తోంది. మొత్తంగా ఈ డివైస్ టెక్నాలజీలో పెద్ద విప్లవమే అని చెప్పాలి.
Also Read: మొబైల్ గేమ్స్ ఆడుతూ చనిపోతున్న టీనేజర్లు.. ఏం జరుగుతోందంటే..