BigTV English

Flight Crash: అయ్యో దేవుడా.. ముక్కలైన విమానం.. చెల్లా చెదురైన శరీర భాగాలు

Flight Crash: అయ్యో దేవుడా.. ముక్కలైన విమానం.. చెల్లా చెదురైన శరీర భాగాలు

Flight Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎయిర్ పోర్ట్ సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. నగరంలోని సివిల్ ఆస్పత్రి సమీపంలో బీజే మెడికల్ కాలేజీపై విమానం కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన 2 నిమిషాలకే విమాన ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. అయతే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో వంద మంది ప్రయాణికులు, 20 మంది మెడికల్ కాలేజీ డాక్టర్లు మృతిచెందినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఇద్దరు ఫైలట్లు, పది మంది విమాన సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.


అయితే, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో చూస్తుంటే.. అత్యంత భయంకరంగా ఉన్నాయి. విమానం పేలిపోవడంతో.. ఫ్లైట్ భాగాలు ముక్కలు ముక్కలుగా అయిపోయాయి. ఒక బ్యాక్ సైడ్ పార్ట్ మాత్రమే కొంచెం కనిపిస్తోంది. మిగిలిన విమానం భాగం మంతా.. చిన్న చిన్న ముక్కులగా మాడి మాసై పోయాయి. ఇక ప్రయాణికులు అయితే గుర్తు పట్టలేనంతగా ఉన్నారు. శరీర భాగాలు చెల్లా చెదురయ్యాయి. ప్రమాదం జరిగిన స్థలమంతా భయంకరంగా మారింది. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

ALSO READ: Flight Crash Video: అహ్మదాబాద్ విమాన ఘటన.. ఇదిగో ఇలా కుప్పకూలింది.. వీడియో వైరల్

విమానం ఇంజిన్ భాగం కాలిపోయి.. తుక్కు తుక్కుగా మారిపోయింది. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశమంతా బిల్డింగులు భారీగా దెబ్బతిన్నాయి. ఇళ్లన్నీ పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. విమానంలో ఉన్న ప్రయాణికులు కాలు, మొండెం, చేతులు చెల్లా చెదురుగా దూరం దూరం పడిపోయాయి. దీంతో ఘటనా స్థలమంతా స్మశానాన్ని తలపిస్తోంది. ప్రమాదంలో ప్రాణ నష్టం భారీగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎంతమంది చనిపోయారు? అనేది తెలియదు.

ALSO READ: Flight Accident: గుజరాత్ ఫ్లైట్ ప్రమాదంలో.. మాజీ సీఎం విజయ్ రూపానీ.!

కానీ.. ఈ ప్రమాదంలో 100 మంది ప్రయాణికులు, 20 మంది డాక్లరు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 50కి పైగా మృతదేహాలను అహ్మదాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు ఈ హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×