Sree Charani : ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహిళా క్రికెటర్ శ్రీ చరణికి ప్రభుత్వం భారీ నజరానా ను ప్రకటించింది. దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నగదును ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అలాగే రూ.2.5 కోట్ల నగదు పురస్కారంతో పాటు కడపలో ఇంటి స్థలం ఇస్తామని పేర్కొంది. ప్రపంచ కప్ లో శ్రీచరణి 14 వికెట్లు తీశారు. దీప్తి శర్మ తరువాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. తనతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి ఈ విషయం తెలిపారని శ్రీచరణి మీడియా కి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని.. అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారని.. మరింత మంది మహిళలకు స్పూర్తిగా నిలవాలని చంద్రబాబు నాయుడు తనతో పేర్కొన్నట్టు తెలిపారు శ్రీచరణి.
Also Read : Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్సర్లు..వీడియో వైరల్
అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి శ్రీ నారా లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ శ్రీచరణి (N. Sri Charani), భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ లకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారు. ముఖ్యంగా, కడప జిల్లాకు చెందిన శ్రీచరణి తన అద్భుతమైన ప్రదర్శనతో మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారు” అని కొనియాడారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను శ్రీచరణి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పంచుకున్నారు.
“వరల్డ్ కప్ టోర్నీలో వంద శాతం ఎఫర్ట్ పెట్టానని.. జట్టు మొత్తం కలిసి కట్టుగా రాణించడంతో వరల్డ్ కప్ కల మాకు సాధ్యం అయిందని శ్రీ చరణి తెలిపింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎల్లప్పుడూ నాతో ఉంటుంది. నా వెంట ఉంటుందని తెలిపారు. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు ఎంతగానో సపోర్టు చేశారని గుర్తుకు చేసుకుంది శ్రీచరణి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. ఇక ముందు ముందు చాలా ఉంది” అని శ్రీచరణి మీడియా సమావేశంలో పేర్కొంది. అంతకు ముందు శ్రీచరణి గన్నవరం ఎయిర్ ఫోర్ట్ కి టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి, క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి ఇవాళ ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత, ఏపీఏ చైర్మన్ కేశినేని చిన్ని, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, ఎంఎస్కే ప్రసాద్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లింది శ్రీచరణి.
Also Read : Shivam Dube: హర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బలవంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్
శ్రీ చరణికి గ్రూప్-1 ఉద్యోగం, రూ. 2.50 కోట్లు నగదు, కడపలో ఇంటి స్థలం..
ప్రకటించిన సీఎం చంద్రబాబు https://t.co/QTNopVZS84
— BIG TV Breaking News (@bigtvtelugu) November 7, 2025