AP Govt Three Wheelers Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన దివ్యాంగులకు 100% సబ్సిడీతో మూడు చక్రాల మోటార్ సైకిళ్లు(రెట్రోఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు) మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానింది. అర్హులైన వారు https://apdascac.ap.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
25.11.2025 నాటికి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఒకటి లేదా రెండు లోయర్ లింబ్స్ 70% లేదా అంతకంటే ఎక్కువ శాతం దివ్యాంగులై ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,00,000/- కంటే ఎక్కువ ఉండకూడదు.
అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
వాహనం నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంతకు ముందు ఏ మోటరైజ్డ్ వాహనాన్ని పొంది ఉండకూడదు లేదా తన పేరుపై ఎలాంటి వాహనం ఉండకూడదు.
1. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే పై స్థాయి కోర్సులు రెగ్యులర్ పద్ధతిలో చదువుతున్న విద్యార్థులు అర్హులు
2. స్వయం ఉపాధి, వ్యవసాయ అనుబంధ రంగాలు లేదా కనీసం ఒక సంవత్సరం అనుభవంతో వేతన ఉద్యోగులు (కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలి).
అర్హులైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు & వృద్ధుల సహాయ సంస్థ (APDASCAC) అధికారిక వెబ్ సైట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈ దరఖాస్తులను జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేస్తారు.
1. వికలాంగుల ధ్రువపత్రం (SADAREM / జిల్లా వైద్య బోర్డు)
2. ఆధార్ కార్డు
3. SSC సర్టిఫికేట్
4. కుల ధ్రువపత్రం (SC, ST, BC అభ్యర్థులకు)
5. లెటెస్ట్ ఆదాయ ధృవపత్రం
6. బోనాఫైడ్ సర్టిఫికేట్ (విద్యార్థుల కోసం) / ఉపాధి ధ్రువపత్రం (స్వయం ఉపాధి లేదా ఉద్యోగుల కోసం)
7. పాస్ పోర్ట్ సైజు ఫోటో
8. ఇంతకు ముందు వాహనం పొందలేదని స్వీయ ధ్రువీకరణ
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 25, 2025