TV: ప్రస్తుతం సెలబ్రిటీలు వరుస పెట్టి శుభవార్తలు చెబుతూ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నిశ్చితార్థం చేసుకుని పెళ్లి వైపు అడుగులు వేస్తుంటే.. మరికొంతమంది పెళ్లిళ్లు చేసుకుని తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ (Katrina Kaif) – విక్కీ కౌశల్ (Vicky Kaushal) తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. పండంటి మగ బిడ్డకు ఈ జంట జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకొంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇప్పుడు మరో టీవీ నటి కూడా తల్లిదండ్రులయ్యామంటూ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. మరి ఆమె ఎవరు? అసలు విషయం ఏమిటి అని ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు బుల్లితెర నటి హర్షిత వెంకటేష్ (Harshita Venkatesh). కన్నడ సీరియల్స్ ద్వారా నటిగా మంచి పేరు సొంతం చేసుకుని.. కన్నడ నటిగా తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హర్షిత వెంకటేష్. తెలుగులో పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించి మెప్పించిన ఈమె.. గత ఐదేళ్ల క్రితం వినయ్ శ్యామ్ సుందర్ (Vinay Shyam Sundar) ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది మొదట్లో తల్లి కాబోతున్నాను అంటూ ప్రకటించిన ఈమె.. మళ్లీ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ను సోషల్ మీడియాలో వదలలేదు. అయితే ఇప్పుడు తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. తన కూతురు చేయి పట్టుకున్నట్టు ఒక ఫోటోని పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే పెళ్లైన ఐదు సంవత్సరాలకు హర్షిత దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడంతో తమ ఆనందానికి అవధులు లేవని చెప్పుకొచ్చారు. ఇకపోతే పెళ్లయిన ఐదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులు అవ్వడంతో అటు అభిమానులు ఇటు సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read:Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!
కన్నడ నటి అయిన హర్షిత తెలుగులో లక్ష్మీ కళ్యాణం, అమ్మకోసం వంటి సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే.. ఈమె భర్త వినయ్ శ్యామ్ సుందర్ తో కలిసి ఇస్మార్ట్ జోడి షోలో పాల్గొని.. అక్కడ పెట్టే భిన్న భిన్నమైన టాస్కులను గెలిచి.. తమ ముందున్న జోడీలను పక్కకు తప్పించి మరీ.. ట్రోఫీ గెలుచుకుంది ఈ జంట. అంతేకాదు 25 లక్షల ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నారు. అలా ఇస్మార్ట్ జోడి షో తో భారీ పాపులారిటీ సంపాదించుకున్న హర్షిత వెంకటేష్.. ఇక కన్నడలో రాజా రాణి రీలోడెడ్ అనే షోలో కూడా సందడి చేసింది. ఇక ప్రస్తుతం ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.