OTT Movie : కొన్ని సినిమాలు రియల్ లైఫ్ కి బాగా కనెక్ట్ అవుతుంటాయి. చదువుకునే వయసులో ప్రేమకథల గురించి చెప్పక్కర్లేదు. ఆ పాత్రల్లో కురాళ్ళు లీనమైపోతుంటారు. తమని ఊహించు కుంటూ గొప్పలకి పోతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ కథ చాలా మంది జీవితాల్లో జరిగిందే. కానీ ఈ సినిమాలో కాస్త డిఫెరెంట్ గా చూపించారు. పెళ్ళికి ముందే, చదువుకునే వయసులో ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. వయసులో ఉన్న ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది. తమిళంలో చిన్న సినిమాగా వచ్చి, పెద్ద విజయాన్ని ఈ సినిమా అందుకుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘దాదా’ (Dada) 2023లో వచ్చిన తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ. గణేష్ కె. బాబు దర్శకత్వంలో కవిన్, అపర్ణా దాస్, ఐశ్వర్య భాస్కర్, కె. భాగ్యరాజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు ఈ సినిమా 2 గంటల 15 నిమిషాలు ఉంటుంది. 2023 ఫిబ్రవరి 10న థియేటర్లలో ఈ సినిమా విడుదల అయింది. 2023 మార్చి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ వెర్షన్‌లో విడుదలైంది. అయితే, నిర్మాతల నిర్ణయం ప్రకారం తమిళ వెర్షన్‌ను తొలగించి, హిందీ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులో ఉంచారు. ‘పాపా’ పేరుతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ జూన్ 13న థియేటర్లలో విడుదలయ్యింది. ఇది ఓటీటీలో విడుదల కాలేదు. IMDb 7.6/10 రేటింగ్ కూడా పొందింది.
మణికందన్ అనే కాలేజ్ అబ్బాయి, సింధు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్లిద్దరూ లవ్‌లో ఉంటూ, సమయాన్ని సంతోషంగా గడుపుతారు. కానీ వీళ్ళు అనుకోకుండా, పెళ్ళికి ముందే ఆ తప్పు కూడా చేయడంతో సింధు గర్భవతి అవుతుంది. మణికందన్ ఆమెను అబార్షన్ చేయించుకోమంటాడు. అందుకు సింధు ఒప్పుకోదు. దీంతో మణికందన్ ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. ఫలితంగా వాళ్లకు అదిత్య అనే బాబు కూడా పుడతాడు. మణికందన్ మీద కోపం, తన కెరీర్ మీద ఆశతో సింధు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆమె మాణికందన్ దగ్గరే బాబును వదిలేసి వెళ్లిపోతుంది. మణికందన్ ఒంటరిగా ఆ చిన్న బాబును పెంచడానికి కష్టపడతాడు. ఈ సమయంలో అతని తల్లి, తండ్రి సపోర్ట్ చేస్తారు ఇతనికి సపోర్ట్ చేస్తారు.
Read Also : అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఆ పాడు పనులు… రివేంజ్ కోసం రగిలిపోయే పేరెంట్స్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్