Rc 17: కొందరి దర్శకులు లైఫ్ లో కొన్ని సినిమాలు ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఉండిపోతాయి. సుకుమార్ ఎన్ని సినిమాలు చేసినా కూడా రంగస్థలం అనే సినిమాకు ఉన్న స్థాయి వేరు స్థానం వేరు. అప్పటివరకు క్లాస్ సినిమాలు తీసే సుకుమార్, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ సక్సెస్ ఫుల్ ఫిలిం తీశాడు. అది కూడా హీరోకి ఒక లోపాన్ని పెట్టి సినిమా సక్సెస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. చిట్టిబాబు అనే క్యారెక్టర్ ని ఎంజాయ్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
హీరోకి లోపాన్ని పెట్టడం అనేది చాలా రిస్కీ పాయింట్. అలాంటి రిస్కీ పాయింట్ నేనొక్కడినే సినిమాలో మొదటిసారి ట్రై చేశాడు సుకుమార్. మహేష్ బాబుకి ఆ ప్రాబ్లం ఉండటంవలనే ఎక్కువ శాతం మందికి ఆ సినిమా ఎక్కలేదు. అయితే కథని పర్ఫెక్ట్ గా చెబితే ఏదైనా ఎక్కుతుంది అని రుజువు చేసిన సినిమా రంగస్థలం. మహేష్ బాబు సరసన నేనొక్కడినే సినిమాలో కృతి సనన్ నటించింది.
ఇప్పటివరకు రామ్ చరణ్ తేజ్ తన కెరీర్ లో 15 సినిమాలు చేశాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అని 16వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇమీడియట్ గా సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమా చేయనున్నాడు రామ్ చరణ్. దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన కూడా గతంలో వచ్చి పూజ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి.
వన్ నేనొక్కడినే సినిమాలో కృతి సనన్ కు అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. బహుశా అందుకోసమే తనకు ఒక మంచి సక్సెస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కృతి సనన్ ను హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సుకుమార్ మళ్లీ రామ్ చరణ్ తో ఎటువంటి సినిమా చేస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. అయితే కొన్ని కథనాల ప్రకారం రంగస్థలం సినిమాకు సీక్వెల్ సుకుమార్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మీద మాత్రం విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలు రాంచరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది.
Also Read: Megastar Chiranjeevi: మన శంకర్ వరప్రసాద్ గారు సెట్ లో విక్టరీ వెంకటేష్, రేపు అఫీషియల్ వీడియో