BigTV English

Beauty Secret: అమ్మాయిలు ఈ సీక్రెట్ మీకోసమే.. ఇది తింటే మెరిసే చర్మం మీ సొంతం

Beauty Secret: అమ్మాయిలు ఈ సీక్రెట్ మీకోసమే.. ఇది తింటే మెరిసే చర్మం మీ సొంతం
Advertisement

Beauty Secret: పుట్టగొడుగులు… ప్రకృతిలో పుట్టే చిన్న మొక్కల్లా కనిపించే ఈ జీవులు మన ఆరోగ్యానికి అనేక విధాల మేలు చేస్తాయి. ఇవి కేవలం వంటలో రుచి కోసం వాడే పదార్థాలు మాత్రమే కాదు, శరీరానికి బలం, చర్మానికి కాంతి, మనసుకు ఆహ్లాదం ఇచ్చే సహజ ఔషధం కూడా. పుట్టగొడుగుల్లో ఉన్న పోషక విలువలు మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ముఖ్యంగా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి.


వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి

పుట్టగొడుగుల్లో ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఆక్సీకరణం వల్ల ఉత్పత్తి అయ్యే హానికారక ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీర కణాలు నశిస్తాయి. దాంతో క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు, అల్జీమర్స్, చర్మ ముడతలు, కాంతి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.


కానీ పుట్టగొడుగుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆ ప్రభావాన్ని అడ్డుకుంటాయి. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. చర్మం యవ్వనంగా మెరిసేలా ఉంచుతాయి. పుట్టగొడుగులు వండినప్పటికీ వాటిలోని పోషక విలువలు తగ్గవు. ఇతర కూరగాయల మాదిరిగా ఉడికించినా యాంటీ ఆక్సిడెంట్లు అలాగే నిలుస్తాయి. అందుకే వీటిని వండి తిన్నా, సూప్‌గా తాగినా, ఫ్రైగా వాడినా సమాన ప్రయోజనం ఉంటుంది.

పుట్టగొడుగుల్లో విటమిన్ డి

పుట్టగొడుగుల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని రక్షించే ప్రధాన విటమిన్. దీని వల్ల మొటిమలు, ఎలర్జీలు, చర్మ పొడిబారడం వంటి సమస్యలు దూరమవుతాయి. మనం వాడే ఫేస్ సీరమ్స్, బ్యూటీ క్రీమ్స్‌లో కూడా పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థాలు వాడతారు. అంటే సహజ అందానికి పుట్టగొడుగులు మూలం. చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే వారానికి రెండు సార్లు అయినా పుట్టగొడుగులు తినడం మంచిది.

Also Read: Toyota GR86 Car: డ్రైవింగ్ ప్రియుల కలల రైడ్.. టర్బో ఇంజిన్ అప్‌డేట్‌తో మార్కెట్‌లోకి 2025 టయోటా GR86

విటమిన్లు, ఖనిజాలు ఎముకలకు బలం

పుట్టగొడుగుల్లో ఉన్న విటమిన్లు, ఖనిజాలు ఎముకలకు బలం ఇస్తాయి. వీటిలో ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ వృద్ధాప్యంలో వచ్చే బలహీనత, జాయింట్ నొప్పులను తగ్గిస్తాయి. ఇమ్యూనిటీ పెరగడానికి పుట్టగొడుగులు ఉపయుక్తం. బీ-విటమిన్లు రక్త ప్రసరణను మెరుగుపరచి శరీరంలో రక్షణ శక్తిని పెంచుతాయి. తరచుగా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. పుట్టగొడుగుల్లో ఉన్న కొన్ని రసాయనాలు మెదడు కణాలను రక్షిస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ మెమరీ తగ్గిపోవడాన్ని అడ్డుకుంటాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ప్రభావం తగ్గుతుంది. మానసిక ప్రశాంతత, దృష్టి కేంద్రీకరణ కూడా మెరుగుపడతాయి.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి కూడా పుట్టగొడుగులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువ. ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. హార్ట్‌కు బలాన్నిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల శాకాహారులకు ఇది అద్భుతమైన ఆహారం. శరీరానికి శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. రోజు వారీ ఆహారంలో చిన్న మోతాదులో అయినా పుట్టగొడుగులు చేర్చుకుంటే శరీరం లోపల నుంచే బలంగా ఉంటుంది.

యవ్వనాన్ని నిలబెట్టే సహజ ఔషధం

వర్షాకాలం పుట్టగొడుగుల కాలం అని చెప్పవచ్చు. ఈ సీజన్‌లో వీటిని ఆహారంలో చేర్చడం ఆరోగ్యానికి మంచిదే. యవ్వనాన్ని నిలబెట్టుకోవాలంటే, చర్మ సౌందర్యం మెరుగుపరచుకోవాలంటే, శరీరానికి ఉల్లాసం పొందాలంటే పుట్టగొడుగులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతమైన బహుమతిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. పుట్టగొడుగులు తినడం వల్ల శరీరం దృఢంగా, మనసు ప్రశాంతంగా, చర్మం కాంతివంతంగా మారుతుంది. పుట్టగొడుగులు మన ఆహారంలో ఉంటే అది కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు, యవ్వనాన్ని నిలబెట్టే సహజ ఔషధం కూడా అవుతుంది.

Related News

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయ్ !

Coconut Oil: కొబ్బరి నూనెను ఇలా కూడా వాడొచ్చా? ఇన్నాళ్లు తేలియలేదే ?

Karpooram: చిటికెడు పచ్చ కర్పూరం.. జీర్ణ సమస్యల నుండి కీళ్ల నొప్పుల వరకు ఉపశమనం

Sugar: చక్కెర లేకుండా టీ, కాఫీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Muscle Growth Food: ఇలాంటి ఫుడ్ తింటే.. తక్కువ టైంలోనే సిక్స్ ప్యాక్

Sleep: ఎలా నిద్రపోతే మంచిది ? చాలా మందికి తెలియని సీక్రెట్ !

Water: రోజుకు ఎంత నీళ్లు తాగాలి ? అతిగా తాగితే ఏమవుతుంది ?

Big Stories

×