BAN vs WI: వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. వన్డే క్రికెట్ లో ఎవరు చేయని సాహసమే వెస్టిండీస్ జట్టు చేసి చూపించింది. ఈ నేపథ్యంలోనే సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది కరేబియన్ జట్టు. ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండవ వన్డేలో 50 ఓవర్లు స్పిన్నర్లే వేశారు. ఒక్క ఫాస్ట్ బౌలర్ లేకుండా 50 ఓవర్ల కోటాను ఫినిష్ చేసింది వెస్టిండీస్. ఇలా వన్డేల్లో అన్ని ఓవర్లు కూడా స్పిన్నర్లే బౌలింగ్ చేయడం వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్ కు సంబంధించిన రికార్డు వైరల్ గా మారింది.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతోంది. ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేలు జరగాల్సి ఉండగా ఇప్పటికే మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఢాకా వేదికగా రెండవ వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లలో రెండు జట్లు సమానంగా పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్స్ లో 7 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది. అటు వెస్టిండీస్ కూడా నిర్ణీత 50 ఓవర్స్ లో 9 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. ఈ మ్యాచ్ గురించి పక్కకు పెడితే, వెస్టిండీస్ వరల్డ్ రికార్డ్ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొత్తం ఐదుగురు స్పిన్నర్లను వాడుకున్న వెస్టిండీస్ , వారితో 50 ఓవర్లు ఫినిష్ చేసింది. ఇలా స్పీడ్ బౌలర్లు లేకుండా స్పిన్నర్లతో 50 ఓవర్ల కోటాను ఫినిష్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది వెస్టిండీస్. అకేల్ హోసిన్, రోస్టన్, ఖారీ పియరీ, మోటీ,అలిక్ అథనాజ్ 50 ఓవర్లు వేసిన వారిలో ఉన్నారు.
వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే డ్రా కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 10 పరుగులు చేసింది. మొదటి బంతికి ఒక పరుగు చేసిన వెస్టిండీస్ ఆ తర్వాత వికెట్ కోల్పోయింది. అనంతరం 2,1,2,4 పరుగులు వచ్చాయి. అంటే 11 పరుగులు బంగ్లాదేశ్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ పరుగులు చేయడంలో కూడా విఫలమైంది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో వెస్టిండీస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఛేజింగ్ చేసే క్రమంలో మొదట వైడ్ బాల్ వేసింది వెస్టిండీస్. ఆ తర్వాత 8 పరుగులు సాధించింది బంగ్లాదేశ్. ఈ తరుణంలోనే, ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది కరేబీయన్ టీం. దీంతో 1-1 తేడాతో సిరీస్ సమం అయింది. ఇక ఈ రెండు జట్ల మధ్య మరో వన్డే ఉంది.
🚨 ABSOLUTE THRILLER in Bangladesh! 🌴🔥
West Indies hold their nerves to beat Bangladesh in a heart-stopping Super Over!
The series is now 1-1, with 1 match still to go! 😱#BANvWI pic.twitter.com/gO1UM9y4Vp
— ICC Asia Cricket (@ICCAsiaCricket) October 21, 2025
Here’s a detailed overview of how the Super Over unfolded for both sides, and how the West Indies sealed the deal to level the three-match ODI series 1-1 with one game remaining.#BANvsWI #ODICricket #SuperOver pic.twitter.com/x1Xo4ZjTjQ
— CricTracker (@Cricketracker) October 21, 2025
West Indies became the first team to go all spin over the course of 50 overs in men’s ODI 🤯
More from the game 👉 https://t.co/sEn9EhicM1 pic.twitter.com/Jzcrnksmvo
— ICC (@ICC) October 21, 2025