Mass Jathara: రవితేజ(Raviteja) శ్రీ లీల(Sreeleela) హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో నటించిన చిత్రం మాస్ జాతర(Mass Jathara). ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మాత నాగ వంశీ హీరో రవితేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిర్మాత నాగ వంశీ మాస్ జాతర సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతుందని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు.. ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగానే విడుదల కావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ అక్టోబర్ 31వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఇలా మాస్ జాతర సినిమా వాయిదా పడటానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా నాగ వంశీ తెలియజేశారు. సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం కానీ అది కుదరకపోయిందని తెలిపారు. మరోసారి ఈ సినిమా విడుదల చేయాలనుకున్న సమయంలో రెండు సార్లు రవితేజ గారికి షూటింగ్లో ప్రమాదం జరిగిందని, అందువల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. రవితేజ ఒక సాంగ్ షూటింగ్లో భాగంగా చెయ్యికి గాయమైంది అలాగే ఫైట్ సన్ని వేషంలో కాలికి గాయం కావడంతో సినిమా వాయిదా వేసుకోవలసి వచ్చిందని తెలిపారు.
ఇక ఈ సినిమాని ఆగస్టు 27వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. అయితే ఈ తేదీన విడుదల కాకుండా వాయిదా పడడానికి కారణం తానే అని నాగావంశీ తెలిపారు. అప్పటికే తాను ఓ సినిమా కారణంగా పెద్ద ఎత్తున నెగిటివిటీ ఎదుర్కొన్నానని తెలిపారు. ఎలాగో మనపై బాగా నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు చేసుకొని కానీ రవితేజ గారికి ఈ సినిమా తన 75వ సినిమా కావడంతో ఎలాంటి నెగెటివిటీ లేకుండా ప్రశాంతంగా ఈ సినిమాని విడుదల చేయాలని భావించాను. అందుకే ఆగస్టు 27వ తేదీ కావాలనే ఈ సినిమాని వాయిదా వేసామని తెలిపారు.
హిట్ సెంటిమెంట్ రిపీట్ కానుందా?
ఆ సమయంలో నాగ వంశీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2(War 2) సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వేడుకలో భాగంగా నాగ వంశీ సినిమా పట్ల చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో భారీగా విమర్శలు వచ్చాయి. ఇలా ఈ సినిమాపై ఏర్పడిన నెగిటివిటీ రవితేజ మాస్ జాతర సినిమాపై పడకూడదన్న ఉద్దేశంతోనే ఆగస్టు 27వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమాని ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేసామని తెలిపారు. ఇక ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు అనుగుణంగానే ఉండబోతుందని ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్, ఫన్ ,యాక్షన్ ఈ సినిమాల్లో ఫుల్ గా ఉన్నాయని తెలియజేశారు. ఈ సినిమాలో రవితేజ మరోసారి రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈయన పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. ఇదే సెంటిమెంట్ మాస్ జాతర సినిమా విషయంలో రిపీట్ అయితే రవితేజకు మరో బ్లాక్ బస్టర్ పడినట్లేనని అభిమానులు కూడా భావిస్తున్నారు.
Also Read: Nagavamshi: ఆ బడా ప్రొడ్యూసర్ ను నమ్మి తప్పు చేశాం.. రియాలిటీలోకి వచ్చిన నాగ వంశీ!