Allu Arjun – Allu Sneha Reddy: అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహా రెడ్డి తాజాగా తన 40వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఫామిలీతో స్నేహా గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె బర్త్‌డే చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.
అల్లు అర్జున్ ఫామిలీకి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
వారి ఫామిలీకి సంబంధించిన ఫోటోలు ఎప్పుడొచ్చిన కూడా నిమిషాల్లో వైరల్ అయిపోతుంటాయి. వారి క్రేజ్‌కు తగ్గట్టుగానే అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహా రెడ్డి ఇద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫామిలీ మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.
అయితే సెప్టెంబర్ 29న అల్లు అర్జున్ భార్య స్నేహా తన 40వ బర్త్‌డే ని సెలబ్రేట్ చేసుకుంది.
ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఫాన్స్, ఫ్రెండ్స్, ఫామిలీ మెంబర్స్ బర్త్‌డే విషెస్‌ని తెలియజేశారు.
ఈ పుట్టిన రోజుని గోవాలో సెలబ్రేట్ చేసుకుంది స్నేహా. తన బర్త్‌డే సెలబ్రేషన్‌లోని కొన్ని బ్యూటీఫుల్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ స్నేహాకి బర్త్‌డే విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే భార్య బర్త్ డేకి బన్ని అదిరిపోయే సర్పైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్నేహా తన సొంత అక్కని, తన ఫ్రెండ్స్‌ని ఆమెకి తెలియకుండా వారిని పిలిచి సర్పైజ్ ఇచ్చాడు బన్ని. దీంతో అల్లు అర్జున్ ఇచ్చిన సర్పైజ్‌కి షాక్ అయింది స్నేహా.