ఉద్యోగులు వీక్లీ ఆఫ్స్ మినహా ఒకటి, రెండు రోజులు సెలవులు కావాలంటే ఇచ్చేస్తారు. కానీ, వారం, పది రోజులు.. అంతకంటే ఎక్కువ కావాలంటే సరైన కారణాలు చూపించాల్సి ఉంటుంది. కానీ, ఓ ఉద్యోగి ఎలాంటి సమాచారం లేకుండా మూడు నెలల పాటు ఆఫీస్ కు వెళ్లడం మానేశాడు. అయినా, ఎవరూ గుర్తు పట్టలేదు. మేనేజర్ కూడా గుర్తించలేదు. సాలరీ కూడా ఇన్ టైమ్ లో వేశారు. తాజాగా ఈ విషయాన్ని సదరు ఉద్యోగి రెడ్డిట్ లో పంచుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అలా ఎలా మేనేజ్ చేశాడంటే..
తాజాగా ఓ రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదట్లో ఆయన పని చేసే కంపెనీ.. ఉద్యోగులను వారానికి 2 రోజులు ఆఫీస్ కు రావాలని చెప్పింది. అయితే, వారంలో ఎప్పుడైనా రెండు రోజులు రావచ్చన్నది. ఏ రోజు రావాలనే విషయంలో కచ్చితమైన నిబంధనలు ఏమీ పెట్టలేదు. సదరు ఉద్యోగి కూడా మొదట్లో కొన్ని వారాల పాటు ఈ విధానాన్ని ఫాలో అయ్యాడు. అయితే, అతడు వెళ్లిన రోజుల్లో ఆఫీస్ సగానికి పైగా ఖాళీగా ఉండేది. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులతో జూమ్ మీటింగ్స్ నిర్వహించేవాడు. తన పని తాను చేసుకుని ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు తను ఆఫీస్ కు వెళ్లే సమయంలో ట్రైన్ లేట్ అయ్యింది. ఆ రోజు నుంచి ఆఫీస్ కు వెళ్లకుండా ఇంటి దగ్గరి నుంచే పని చేయాలని భావించాడు. మూడు నెలల పాటు ఆఫీస్ కు వెళ్లలేదు. ఇంటి దగ్గర ఉన్నా వర్క్ మాత్రం పక్కాగా చేసేవాడు. టీమ్ అందరితో ఎప్పకటిప్పుడు టచ్ లో ఉండేవాడు. ఆయన పని తీరుపై మేనేజర్ కూడా ప్రశంసలు కురిపించాడు. తానుకు ఆఫీస్ కు వెళ్లపోయినా, తన పని విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని చెప్పుకొచ్చాడు. అందుకే, మేనేజర్ ప్రశంసలు పొందినట్లు వివరించాడు.
My manager said “ remote work kills team connection ”, so I invited him to one of our calls
byu/FUNKY_RADISH inremotework
Read Also: నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలిస్తా.. యువతి బంపర్ ఆఫర్, కక్కుర్తి పడి వెళ్లినోడు ఏమయ్యాడంటే?
ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నేను 8 సంవత్సరాలు నా పాత బాస్ పక్కన కూర్చున్నాను. మేము చక్కగా కలిసి పని చేశాం. మేమిద్దరం కంపెనీని విడిచిపెట్టిన తర్వాత నిజంగా మంచి స్నేహితులమయ్యాము. మేము ఇప్పటికీ నెలకు ఒకటి, రెండుసార్లు కలిసి డిన్నర్ చేస్తాం” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఉద్యోగి ఎక్కడ ఉన్నాడు అనే విషయం కంటే, తనకు అప్పగించిన పని ఎంత చక్కగా చేస్తున్నాడు అనేదే ముఖ్యం. అందుకే. మీరు ఇంటి దగ్గర ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. ఫైనల్ గా కంపెనీకి కావాల్సింది ఔట్ పుట్ మాత్రమే” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?