BigTV English

Unstoppable4: బాలయ్య షో కి ఫస్ట్ గెస్ట్ ఎవరంటే. టీఆర్పీ రికార్డు పక్కా..!

Unstoppable4: బాలయ్య షో కి ఫస్ట్ గెస్ట్ ఎవరంటే. టీఆర్పీ రికార్డు పక్కా..!

Unstoppable 4.. నటసింహ నందమూరి బాలకృష్ణ (Nanadamuri Balakrishna) హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తున్నారని ప్రకటించినప్పుడు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. అసలు మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈయన హోస్ట్ గా చేయగలరా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఒక్కసారి హోస్ట్ గా స్టేజి పైకి అడుగుపెట్టగానే మొత్తం మారిపోయింది. తన మాట తీరుతో అందరిని ఆకట్టుకున్నారు. మధ్యమధ్యలో కామెడీ చేస్తూ హోస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు షో టీఆర్పీ రేటింగ్ ను కూడా పెంచేసి, అమాంతం సీజన్ సక్సెస్ అయ్యేలా చేశారు.


అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదలు..

ఇకపోతే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ సీజన్స్ 1,2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. అలాగే ఎడిషనల్ సీజన్ కింద మూడవ సీజన్ కూడా విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే సీజన్ 4 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ దసరాకి అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య కూడా ఈ సీజన్ 4 పై ఆసక్తికరంగా ఎదురు చేస్తున్నారనే కామెంట్లు కూడా వినిపించాయి . ఇకపోతే గతంలో కంటే ఎక్కువ మంది స్టార్ సెలబ్రిటీలను గెస్ట్ లుగా ఈ సీజన్ కి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం.


ఫస్ట్ గెస్ట్ ఆయనే..

ఇకపోతే తాజాగా సీజన్ 4 కి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) రాబోతున్నారట. తాజాగా ఈయన నటించిన లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి ఆడియన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అయితే సీజన్ 4 మొదటి ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించడం ఖాయం అంటూ అప్పుడే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

లక్కీ భాస్కర్ ప్రమోషన్ షురూ..

ఇక దుల్కర్ సల్మాన్ సినిమా విషయానికి వస్తే.. లక్కీ భాస్కర్ అంటూ తెలుగులో నేరుగా నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ దసరా నుంచి మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఇక ప్రమోషన్స్ లో భాగంగానే ఈ షో కి దుల్కర్ సల్మాన్ గెస్ట్ గా హాజరుకానున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో దుల్కర్ సల్మాన్ తో పాటు నిర్మాత నాగవంశీ , డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా పాల్గొనబోతున్నారట. ఈ ముగ్గురు కూడా తమ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలు కూడా పంచుకోబోతున్నారని సమాచారం. మరోవైపు బాలకృష్ణ, బాబీ డైరెక్షన్లో తన 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today october 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరుకు మరో వరం ఇచ్చిన గుప్త

Intinti Ramayanam Today Episode: పల్లవి పై అవనికి అనుమానం.. రాజేశ్వరికి నిజం చెప్పిన అవని..శ్రీవల్లికి కమల్ షాక్…

Brahmamudi Serial Today October 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌కు చుక్కలు చూపిస్తున్న కావ్య, అపర్ణ, ఇంద్రాదేవి

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ సక్సెస్.. దిమ్మతిరిగే షాకిచ్చిన నర్మద..వణికిపోతున్న శ్రీవల్లి..

GudiGantalu Today episode: ప్రభావతిని ఇరికించిన మీనా.. కామాక్షి దెబ్బకు ఫ్యూజులు అవుట్..పాపం బాలు..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Jayammu Nischayammuraa:  సింగపూర్ క్రైమ్ లో కీర్తి సురేష్… సంతోషమే వేరన్న మహానటి!

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా లవ్ స్టోరీ.. ఊహించని ట్విస్టులు..

Big Stories

×