కిచెన్‌లో ఉన్న మిస్సమ్మ తనకు వచ్చిన కల గురించి ఆలోచిస్తుంది. బయట నుంచి గమనిస్తున్న మనోహరి నవ్వుకుంటుంది. ఇంతలో అమర్ వచ్చి పాలు పొంగిపోతుంటే.. స్టవ్ ఆపేస్తాడు. ఏవండి రెడీ అయ్యారా..? కాఫీ పెట్టమంటారా? అని అడుగుతుంది. ఇప్పుడు ఏమీ వద్దులే కానీ రా వెళ్దాం అని మిస్సమ్మను రూంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి.. భాగీ ఎందుకో డిస్టర్బ్ అయింది. ఏదో ఒకటి చేసి భాగీ మూడ్‌ను మార్చాలి అని మనసులో అనుకుని భాగీ నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్తాడు. రూంలోకి వెళ్లిన మనోహరి రణవీర్‌కు కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన రణవీర్ చెప్పు మనోహరి ఇంత పొద్దున్నే కాల్ చేశావు అని అడుగుతాడు. చంబా పూజ మొదలు పెట్టిందా..? అని మనోహరి అడగ్గానే.. అవును ఇప్పుడే మొదలు పెట్టింది.. చంభా చాలా నిస్టగా పట్టుదలగా పూజ చేస్తుంది. అయినా ఈ విషయం నీకు ఎలా తెలుసు..? అని రణవీర్ అడగ్గానే..
అక్కడ పూజ తాలుకా ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. భాగీ నిద్ర లేవగానే బాగా డిస్టర్బ్ అయింది అని మనోహరి చెప్పగానే.. అయితే ఈ సారి నువ్వు అనుకున్నది జరగబోతుంది అన్నమాట.. అంటాడు రణవీర్. కచ్చితంగా జరగాలి రణవీర్.. అందుకే చంభాను అక్కడికి పంపాను.. అని మనోహరి చెప్పగానే.. నాకోసం వచ్చిన చంభా నీకోసం చాలా కష్టపడుతుంది. మనుషుల్ని వాడుకోవడంలో నీ తర్వాతే ఎవరైనా అంటాడు రణవీర్. దీంతో మనోహరి కుళ్లుకోకు రణవీర్.. నాకు మంచి జరిగితే నీకు మంచి జరిగినట్టే కదా అంటుంది. నీకు మంచి జరగడం అంటే చాలా మందికి చెడు జరగడంతో సమానం అని మనసులో అనుకంటాడు రణవీర్. పూజ అయిపోగానే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు అంటుంది మనోహరి. మళ్లీ నేను చెప్పడం ఎందుకు..? డైరెక్టుగా చంభానే వచ్చి చెప్తుంది కదా అంటాడు రణవీర్.. సరే అయితే అంటూ కాల్ కట్ చేస్తుంది మనోహరి.
తర్వాత బయటకు వచ్చిన మనోహరి హాల్లో ఎవ్వరూ కనిపించకపోయే సరికి వీళ్లు ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ.. బెడ్ రూంలోకి వెళ్లి ఉంటారా..? అని మనసులో అనుకుంటూ.. పైకి వెళ్తుంది. పైన అమర్ పాలు తీసుకెళ్లి మిస్సమ్మకు ఇస్తూ.. ఒక్క చుక్క కూడా మిగలకుండా మొత్తం పాలన్ని తాగాలి అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ ఏంటండి మీరు మరీను.. నన్ను మరీ నైంత్ మంత్ ప్రెగ్నెంట్‌లా చూస్తున్నారు.. అని మిస్సమ్మ అనగానే.. ఏ మంత్ అయితే ఏంటి… నువ్వు ప్రెగ్నెంటే కదా..? నిన్ను కేరింగ్ గా చూసుకోవాలి.. అంటూ అమర్ చెప్తుంటాడు. డోర్ దగ్గర నిలబడి అంతా చూస్తున్న మనోహరి ఈ కేరింగ్ అంతా కాసేపే అమర్.. ఆ తర్వాత అది మిస్ క్యారింగ్ అవుతుంది అని మనసులో అనుకుంటుంది. మిస్సమ్మ ఈ ప్రేమంతా నా మీదనా..? లేక నాకు పుట్టబోయే బిడ్డ మీదనా..? అని అడగ్గానే.. మీ ఇద్దరి మీద అని అమర్ చెప్తాడు. దీంతో మిస్సమ్మ ఎమోషనల్ అవుతుంది. మనోహరి చూడలేక వెళ్లిపోతుంది.
తర్వాత పిల్లలు గార్డెన్ లో ఆడుకుంటూ ఉంటారు. ఆనంద్, ఆకాష్ మధ్య చిన్న గొడవ మొదలవుతుంది. దీంతో ఆనంద్ షార్ప్‌నర్‌తో ఆకాష్‌ను పొడిచేందుకు వెళ్తుంటాడు. ఆకాష్ తప్పించుకుని పరుగెడుతుంటాడు. ఇంతలో లోపలి నుంచి మనోహరి వచ్చి ఆగండి అని చెప్పినా వినరు.. పిల్లల సౌండ్‌కు లోపలి నుంచి మిస్సమ్మ బయటకు వస్తుంది. ఇద్దరిని ఆగమని చెప్పినా వినకుండా అలాగే పరుగెడుతుంటారు. మనోహరి మాత్రం ఆ ఇద్దరు పిల్లలు వచ్చి మిస్సమ్మను తగిలితే మిస్సమ్మకు అబార్షన్ అవుతుందని మనసులో అనుకుంటుంది. అనుకోగానే.. పిల్లలు ఇద్దరూ మిస్సమ్మ వైపు పరుగెత్తుకుంటూ వస్తారు. ఆకాష్ మిస్సమ్మ చాటుకు వెళ్లగానే.. ఆనంద్ చేతిలో షార్ప్‌నర్ మిస్సమ్మకు గుచ్చుకుంటుంది. అది చూసిన మిస్సమ్మ భయపడుతుంది. మిగతా పిల్లలు షాక్ అయిపోతారు.. మనోహరి హ్యాపీగా నవ్వుతూ చూస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.