Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా.. టీం మీడియాకు కెప్టెన్ గా కూడా వ్యవహరించిన రికార్డులు ఉన్నాయి. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో చాలా సార్లు ఆదుకుని, విజయ తీరాలకు చేర్చాడు హార్థిక్ పాండ్యా. అయితే అలాంటి హార్దిక్ పాండ్యా ఇటీవల గాయం బారిన పడ్డారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ ఆడకుండానే ఇంటికి వచ్చేసిన హార్దిక్ పాండ్యా ( Hardik Pandya), ప్రస్తుతం తన ప్రియురాలు మహికా శర్మతో ( Mahieka Sharma ) ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా లంబోర్ఘిని కారు ( Lamborghini car) కడుగుతూ, తన ప్రియురాలతో ఎంజాయ్ చేశాడు. కారు కడుగుతూనే ఈ ఇద్దరు ముద్దులు కూడా పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల తన కొత్త ప్రేయసిని పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా, ఆమెతో ఫుల్ ఎంజాయ్ లో కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నారు. జాలిగా గడిపేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా తన లంబోర్ఘిని కారును హార్దిక్ పాండ్యా వాష్ చేశాడు. వాస్తవానికి ఇలాంటి రిచ్ క్రికెటర్… షోరూంలో కార్లు వాష్ చేయించుకుంటారు. కానీ హార్దిక్ పాండ్యాలా కాదు… తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి కారు వాష్ చేశాడు. సబ్బు పెట్టి కారును బాగా కడిగాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ వాటర్ కొట్టింది.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు రొమాన్స్ చేసుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది. కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యాలను కిస్ చేసి, మహికా శర్మ ఊపు తెప్పించింది. ఈ వీడియో వైరల్ కావడంతో టీమిండియా అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక ముద్దు పెట్టి తన కారును మొత్తం కడిగించుకుందని… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ లంబోర్ఘిని కారు హార్దిక్ పాండ్యాదని.. ఆయన ప్రియురాలు మహికా శర్మ కాదని మరి కొంతమంది అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం హాట్ టాపిక్ అయింది. ఒకవేళ ఈ వీడియో గనుక నటాషా చూస్తే కచ్చితంగా కడుపు మండి చచ్చిపోతుందని హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ కంటే ముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డాడు హార్థిక్ పాండ్యా. దీంతో ఫైనల్ ఆడకుండానే వెనుదిరిగాడు. అయితే ఎడమ కాలి గాయం కారణంగా టీమిండియా కు దూరనమైన హార్దిక్ పాండ్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో దక్షిణాఫ్రికా తో స్వదేశంలో జరిగే వన్డే అలాగే టీ20 సిరీస్ సమయంలో హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి దాదాపు హార్దిక్ పాండ్యా కోలుకున్నాడని చెబుతున్నారు.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
Hardik Pandya having fun with his Girlfriend Mahieka Sharma while washing his Lamborghini car pic.twitter.com/RGAogEZ15d
— sonu (@Cricket_live247) November 4, 2025