EPAPER

Trivikram – Allu Arjun : ‘త్రివిక్రమ్‌తో తియ్యొద్దు’… కానీ, బన్నీ వినేలా లేడే..

Trivikram – Allu Arjun : ‘త్రివిక్రమ్‌తో తియ్యొద్దు’… కానీ, బన్నీ వినేలా లేడే..

Trivikram – Allu Arjun Movie : త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆయన తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద డైరెక్టర్. ఆయన మాటలతో గారడీ చేయగలడు. అందుకే, ఈయనను మాటల మాంత్రికుడు అని అంటారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కిస్తాడు. ఆయన డైరెక్ట్ సినిమాలు దాదాపు అన్ని కూడా మంచి విజయాన్ని సాధించాయి. కొన్ని డిజాస్టర్ మూవీలు ఉన్నా… ఆయా హీరోల ఫ్యాన్స్ ఆ డిజాస్టర్ సినిమాలు బాగానే నచ్చుతాయి. అందుకే త్రివిక్రమ్‌తో తమ హీరో మరోసారి సినిమా చేయాలని అనుకుంటారు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు ఇది కొంత మేర తగ్గింది.


గుంటూరు కారం మూవీ తర్వాత త్రివిక్రమ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ ఎవరితో మూవీ చేస్తాడు అని ఓ సస్పెన్స్ కూడా ఉండేది. అయితే, త్రివిక్రమ్ తర్వాత మూవీ అల్లు అర్జున్ తో ఆల్మోస్ట్ కన్ఫామ్ అని చాలా రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీన్ని అంగీకరించలేకపోతున్నారు. త్రివిక్రమ్ తో వద్దు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

దీనికి కారణం లేకపోలేదు. త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకునే సినిమాలు చేశాడు. మాస్ ఆడియన్స్ టార్గెట్ చేసినా.. అది ఫ్యామిలీ ఆడియన్స్ కే కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అలాగే ఎక్కడో పాత సినిమాల్లో ఉండే వాటిని తీసుకొచ్చి తన మూవీల్లో వాడుతాడు అనే పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఇక గుంటూరు కారం కొంత వరకు సేఫ్ అయినా… స్వయంగా మహేష్ బాబు ఫ్యాన్సే ఈ మూవీపై పెదవి విరిచారు. సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి ఫస్ట్ రీజన్ మహేష్ ఫ్యాన్సే. ఈ విషయాన్ని నిర్మాత నాగ వంశీ కూడా ఓ టైంలో అంగీకరించాడు.


త్రివిక్రమ్ సంగతి ఇలా ఉంటే… అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప పార్ట్ 1 తోనే పాన్ ఇండియా వైడ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక పుష్ప 2 రాబోతుంది. ఇది బన్నీ ఇమేజ్ మరింత పెంచేలా ఉంటుంది. ఈ మూవీతో రామ్ చరణ్ లా.. అల్లు అర్జున్ కూడా గ్లోబల్ స్టార్ అవుతాడని ఇప్పటికే సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

అదే జరిగితే, అల్లు అర్జున్ తర్వాత చేయాల్సిన ప్రతీ మూవీపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం బన్నీతో సినిమాలు చేయడానికి పాన్ ఇండియా డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇప్పటికే ఓ స్టోరీ ఫైనల్ చేశాడు. అలాగే, అనిమల్ ‌తో సెన్సెషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగాతో కూడా బన్నీ ఓ మూవీ చేయాల్సి ఉంది.

ఇలాంటి పాన్ ఇండియా డైరెక్టర్స్ తో లైనప్ పెట్టుకున్న బన్నీ, ఇప్పుడు త్రివిక్రమ్‌తో మూవీ అంటే ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. బన్నీ, త్రివిక్రమ్ కాంబో లో ఇప్పటి వరకు వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో సినిమాలు హిట్ అయ్యాయి. కానీ, పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఇది కాదు. కేవలం భారీ సినిమాలు మాత్రమే చేయాలి అని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటారు. గతంలో మహేష్ బాబుతో త్రివిక్రమ్ భారీ సినిమా, పాన్ ఇండియా మూవీ అని అన్నాడు. కానీ, గుంటూరు కారం ఎలా అయిపోయింది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. పుష్ప 2 తర్వాత అంతటి రేంజ్ ఉన్న సినిమాలే చేయాలని, అట్లీ, సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్స్ తో మూవీస్ లైనప్ చేసుకున్నాడు బన్నీ. రాబోయే మూవీ కూడా అలాగే ఉండాలని అంటున్నారు.

కానీ, బన్నీ మాత్రం తన తర్వాత మూవీ తనకు మూడు హిట్స్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తోనే ఉంటుందని ఫిక్స్ అయిపోయాడట. మరి చూడాలి బన్నీ ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ ఎలాంటి మూవీని అందిస్తాడో…

Related News

Unstoppable with NBK: సీజన్ 4 మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్.. నంద్యాల టాపికే హైలైట్.. ?

Vettaiyan: ‘వేట్టయాన్’పై తెలుగు ప్రేక్షకుల ఆగ్రహం.. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం?

Shobitha Dulipala : అప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చాను… అక్కినేని కోడలు బయటపెట్టిన నిజం..

Tripti dimri: యానిమల్ విజయం నరకాన్ని మిగిల్చింది.. బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

Maa Nanna Super Hero : సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ … రెండ్రోజుల ముందే మూవీ రిలీజ్

Vettaiyan Movie Review : వెట్టయాన్ మూవీ రివ్యూ… రజినీకాంత్‌కి ఇది సరిపోయిందా…?

Nayanatara: నయన్ కొత్త వివాదం… ఆమె పిల్లల ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలా?

×