Manchu Manoj:మంచు మనోజ్(Manchu Manoj).. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. మోహన్ బాబు (Mohan Babu) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr .NTR) మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలు పెట్టిన మంచు మనోజ్.. ఆ తర్వాత పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ‘ దొంగ దొంగది’ అనే సినిమాతో హీరోగా అవతరించారు. తర్వాత బిందాస్ సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును స్పెషల్ జ్యూరీ విభాగంలో దక్కించుకున్నారు.
తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి.. హీరోగా నిలదొక్కుకున్న ఈయన కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ గ్యాప్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2015 మే 20న పెద్దల కోరిక మేరకు ప్రణతి రెడ్డితో హైదరాబాదులో హైటెక్స్ లో పెళ్లి జరగగా.. 2019లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఫిలింనగర్ లోని మంచు నిలయంలో 2023 మార్చి 3న భూమా మౌనిక రెడ్డి (Bhuma Mounika Reddy)ని రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు గత ఏడాది ఏప్రిల్ 13న పాప జన్మించింది. ఒకవైపు కెరియర్ లో.. మరొకవైపు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మంచు మనోజ్ దాదాపు తొమ్మిదేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత ‘భైరవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్.. ఈ ఏడాది సెప్టెంబర్ 12న చిత్రంతో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ALSO READ:Dance master: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు..మరీ ఇంత దారుణమా?
ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాదులో రాజు వెడ్స్ రాంబాయి సినిమాలోని..” రాంబాయి నీ మీద నాకు మనసాయనే” సాంగ్ రిలీజ్ ఈవెంట్ కి మనోజ్ తన భార్యతో కలిసి హాజరయ్యారు. ఈ పాట చరణాన్ని ప్రస్తావిస్తూ.. తన ప్రేమ ప్రపోజల్ ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. మనోజ్ మాట్లాడుతూ..” ఈ ప్రపంచంలో తారతమ్యాలు లేనిది ఒక్క ప్రేమలో మాత్రమే.. ఇటు రాంబాయి నీ మీద నాకు మనసాయెనే పాటలో రాజ్యం ఏది లేదు కానీ రాణి లాగా చూసుకుంటా అన్నట్టు.. నేను కూడా మౌనికకు మాటిచ్చాను. అందరు అనుకుంటున్నట్లు నాకు రాజ్యాలు లేవు. ఒక్కడినే ఉన్నాను. ప్రస్తుతానికి సినిమాలు కూడా చేయట్లేదు. కానీ మళ్ళీ నటిస్తా.. కష్టపడుతూ .. జీవితాంతం నిన్ను రాణి లాగా చూసుకుంటాను. నన్ను నమ్ముతావా.. నాతో వస్తావా అని అడిగాను. నన్ను నమ్మింది ఇక జీవితాంతం తోడుంటాను” అంటూ మనోజ్ కామెంట్ చేశారు. మనోజ్ చేసిన ఈ కామెంట్స్ మనసులను హత్తుకుంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.