The Girl Friend Censor : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుసగా 100 కోట్ల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో నుంచి ఈమె నటించిన థామా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది.. ఈనెల 7న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. రష్మిక మందన్న తొలిసారి నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్లలో చూస్తామని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ రివ్యూ పూర్తయింది. సెన్సార్ రిపోర్టు ప్రకారం ఈ మూవీలో కొన్ని సీన్లను కట్ చేసినట్లు తెలుస్తుంది. హద్దు మీరిన లిప్ కిస్లు ఉన్నాయని ఆ సీన్లను కట్ చేసినట్లు ఓ వార్త అయితే ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సెన్సార్ రిపోర్ట్ లో ఏముందో ఒకసారి తెలుసుకుందాం..
దీక్షిత్ షెట్టి హీరోగా నటించగా, రష్మిక మందన్న హీరోయిన్ జంటగా నటిస్తున్న ఈ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’.. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ రాబోతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమాకు 138 నిమిషాల అంటే 2 గంటలు 18 నిమిషాలు నిడివి లభించింది.. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్యన లవ్, బ్రేకప్, ఫ్యామిలీ బాండీ లాంటివన్నీ జోడించి కథని రూపొందించినట్లు క్లారిటీ వచ్చేస్తుంది.. అయితే ఈ మూవీలో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. సెన్సార్ కి వెళ్లిన సినిమాకు లో కొన్ని సీన్లు కట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే మెయిన్ సీన్లను కట్ చేయడంతో సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి ఈ మూవీ నుంచి సెన్సార్ కత్తిరించిన ఆ బోల్డ్ సీన్లు ఏంటో ఒకసారి చూసేద్దాం..
Also Read :సేనకు నర్మద వార్నింగ్.. భాగ్యంకు దిమ్మతిరిగే షాక్.. రామా రాజు ఇంట పెద్ద గొడవ..
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తాజాగా సెన్సార్ ని పూర్తి చేసుకుంది.. యు/ఏ సర్టిఫికెట్ ని సొంతం చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ సభ్యులు షాక్ ఇచ్చారు.. రొమాంటిక్ స్టోరీ గా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా లో కొన్ని బోల్డ్ సీన్లు కూడా ఉన్నాయని వాటిని కట్ చేశారు. అందులో ఎక్కువగా లిప్ లాక్ సీన్లు ఉన్నాయని వాటిని సెన్సార్ కట్ చేసింది. అదేవిధంగా పిల్లలకి పేరెంట్స్ కి సంబంధించిన కొన్ని సీన్లను కట్ చేసినట్లు తెలుస్తుంది.. వీటితో పాటుగా ఈ సినిమాలో ఎక్కువగా ఫక్ అనే పదం కూడా ఉందని వాటిని కూడా కట్ చేసినట్లు సెన్సార్ రిపోర్టులో ఉంది.. టైలర్ లో చూపించిన దాని కంటే సినిమాలో ఎక్కువగా ఉండడంతో సెన్సార్ రివ్యూ లో వాటిని తీసేసినట్లు తెలుస్తుంది.. మరి మెయిన్ సీన్లు లేపడంతో ఈ సినిమాకు ఏదైనా ఎఫెక్ట్ పడుతుందేమో చూడాలి.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి రష్మిక మందన్న సినిమా కావడంతో దీనికి మొదటిమరి రష్మిక మందన్న సినిమా కావడంతో దీనికి మొదటి నుంచి హైఫ్ క్రియేట్ అయ్యింది. మరి రిలీజ్ అయ్యాక ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…