Illu Illalu Pillalu Today Episode November 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం ఐదు గంటల అవ్వగానే ప్రేమ, ధీరజ్ని లేపుతుంది. ఏంటి ఇంత పొద్దున్నే లేపావు నీకు టైం కావాలంటే వాచ్లను ఫోన్లోనో చూసుకోవాలి అని అంటాడు.. నిన్న ఎన్ని కోతల కోసమో గుర్తుందా అందుకే ఇప్పుడు రన్నింగ్ కి వెళ్దాం పద అనేసి ధీరజ్ ని అంటుంది.. ఇద్దరు కలిసి రన్నింగ్ కోసం అని బయటకు వెళ్ళిపోతారు. శ్రీవల్లి అమూల్యకు మాయమాటలు చెప్పి బయటికి వెళ్దాం పద అని తీసుకొని వెళ్తుంది.. విశ్వం అమూల్యను చూసి అమూల్య దగ్గరికి వస్తాడు. నువ్వు మా అత్త కూతురు గాని నేను నీతో చనువు తీసుకొని మాట్లాడుతున్నాను కానీ నువ్వేంటి అసలు ఏదో ఇష్టం లేనట్టు చేస్తున్నావు అని అమూల్యతో విశ్వం అంటాడు. ఆ దేవుడు సాక్షిగా నీకు ఒక విషయాన్ని చెప్పాలి అని విశ్వం అమూల్యతో అంటాడు.. ఐ లవ్ యు అమూల్య అని అంటాడు.. పక్కనే ఉండి చాటుగా వీళ్ళ మాటలు వింటున్న శ్రీవల్లి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.. బండ సచ్చినోడు ఇంత పని చేశాడు ఏంటి అని షాక్ అవుతుంది.. మొత్తానికి అమూల్యను శ్రీవల్లి మ్యానేజ్ సేవ్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా భద్రావతి సేన వాళ్ళ ప్రాపర్టీ లను సీజ్ చేయిస్తుంది.. అక్కడికి వచ్చిన భద్రాసేన ఇద్దరు కూడా నర్మదతో మాట్లాడతారు.. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ మీకు ఆల్రెడీ నోటీసులు పంపాం మీరు రెస్పాండ్ అవ్వలేదు అందుకే సీజ్ చేశామని అంటుంది.. ఎంత ధైర్యం ఉంటే మా వస్తువులనే సీజ్ చేస్తావు అని నర్మదపై కక్ష కట్టేస్తారు సేన.. ఇది ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని నర్మదా అంటుంది.. ఇక అమూల్య చాలా ఆవేశంగా ఇంటికి రావడం చూసిన శ్రీవల్లి ఈ విషయాన్ని నేను వెంటనే మా నాన్నకి చెప్పాలి అని అంటుంది.. అమూల్య ఆ విషయాన్ని గనుక చెప్తే కచ్చితంగా నా మీదకు వస్తుంది అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు ఎవరో ఒకరి చావును కోరుకుంటున్నావా.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా నీకు అని శ్రీవల్లి అంటుంది. ఇక శ్రీవల్లి చెప్పిన మాటలు విని అమూల్య విశ్వం గురించి ఇంట్లో చెప్పడం ఆ మానేస్తుంది..
నీకెంత ధైర్యం ఉంటే మా ఆస్తులని సీజ్ చేస్తావా..? మీ మావయ్య కచ్చితంగా ఇలా చేయమని చెప్పాడు మమ్మల్ని సాధించాలని చెప్పాడా..? నిన్నేం చేస్తానో చూడు అని సేన అంటాడు. మిస్టర్ సేనాపతి మీరేం చేయాలనుకున్న ఆలోచించండి అని నర్మదా అంటుంది. మీరు ఎక్కువ చేస్తే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తుంది.. ఇక శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వెళ్తుంది. రాత్రి ఎవరూ తలుపు కొడుతున్నారు అని ఆనందరావు టెన్షన్ పడుతూ ఉంటాడు.. అయితే ఈ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారు ఏమో అని ఆనందరావు కంగారుపడుతూ ఉంటాడు..
ఏంటమ్మా ఈ అమ్మ నాన్నని మర్చిపోలేక పోతున్నావా ఇప్పుడు వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది భాగ్యం.. ఆ చేతిలో పూల దండలు ఏంటి అని అనగానే నాకు ఇంత మంచి జీవితాన్ని ఎన్నో అబద్ధాలు ఆడినా పెళ్లి చేశారు.. నాకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చిన మీకు సన్మానం చేయాలని పూలదండలు తీసుకొని వచ్చాను అని శ్రీవల్లి అంటుంది.. అయితే మీ వల్ల నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఇవాళ అమూల్యని గుడికి తీసుకెళ్లాను… ఆ బండ సచ్చినోడు అమూల్యని ప్రేమిస్తున్నానని చెప్పాడు ఇంట్లో నా బంగారం బయటపడేది క్షణాల్లో తప్పించుకున్నాను.. బండ బూతులు తిట్టేస్తుంది శ్రీవల్లి..
ఇక సేనాపతి తాగేసి ఇంటి దగ్గరకు వచ్చి రామరాజు అని రచ్చ చేస్తాడు.. అతను మాట్లాడిన మాటలకి ఇంట్లోని వాళ్ళందరూ బయటకు వచ్చి అతనితో గొడవకు దిగుతారు. ఆ కూలోడు ఆ రామరాజు గాడు ఎక్కడున్నాడు ఇంట్లో గాజులు వేసుకొని కూర్చున్నాడా అని అనగానే ముగ్గురు కొడుకులు సేన నీ కొట్టడానికి వెళ్తారు.. అయితే వేదవతి మీరు అక్కడికి వెళ్లి గొడవకి దిగితే నా మీద కొట్టే అని అందరిని ఇంట్లోకి పెట్టి గేట్ వేస్తుంది.. వాడు ఎదురుకోలేక కోడలు అడ్డుపెట్టుకొని నా పై కక్ష సాధిస్తున్నాడా అని సేన అంటాడు. నా ఆస్తులని కబ్జా చేశారు అని జప్తు చేస్తారా ఎంత ధైర్యం అని అనగానే నర్మదా ముందుకు వస్తుంది.
సేనాపతి గారు అది గవర్నమెంట్ స్థలాలు. మీరు కబ్జా చేశారు. మీకు నోటీసులు పంపాము. మీరు ఎన్నిసార్లకి రెస్పాండ్ అవ్వలేదు అందుకే వాటిని సీజ్ చేసాము… మీరు ఏదైనా ఉంటే ఆఫీసులో చూసుకోవాలి ఇలా ఇంటి మీదకు వచ్చి మమ్మల్ని మా మామయ్యని తిట్టడం కాదు అని నర్మదా అంటుంది.. ఇలా చేశారని తెలిస్తే నేను లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని నర్మదా వార్నింగ్ ఇస్తుంది.. ఏంటి నన్ను జైలుకు పంపిస్తావా నీకు అంత ధైర్యం ఉందా నీ అంతు చూస్తాను అని సేన అంటాడు.. రేవతి సేనను లోపలికి తీసుకుని వెళుతుంది..
Also Read :మీనాక్షి పై శ్రీయ సీరియస్..తల్లి రాకతో అవని హ్యాపీ.. ఫ్రెండ్ ను కలిసిన పల్లవి..
లోపలికి వచ్చిన ధీరజ్ సేనాపతి పై కోపంగా ఉంటాడు.. ధీరజ్ ప్రేమ లోపలికి రాగానే మీ నాన్న కొంచెమైనా బుద్ధుందా? తాగేసి కూతురు వయసు అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నాడో చూసావా అని అంటాడు. అయితే ఇంకా విషయం గురించి వదిలేయ్ రా నీ ప్రేమ అంటుంది.. ప్రేమ ఎంత చెప్తున్నా కూడా ధీరజ్ పదేపదే ఆ విషయం చెప్పడంతో ప్రేమ సీరియస్ అయ్యి ఇద్దరు కొట్టుకుంటారు.. ఇక తర్వాత సేన అన్న మాటలను తలుచుకొని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నర్మదా ఏంటి అత్తయ్య ఇంత పొద్దుకైనా కూడా మీరు ఇంకా పడుకోలేదు రండి.. పడుకుందురు అని అంటుంది. నీతో ఒక విషయం గురించి మాట్లాడలని వేదవతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..