BigTV English
Advertisement

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ  వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

H1B Visa VS EB5 Visa: విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులంతా.. చలో అమెరికా అంటున్నారు. అక్కడే.. పర్మినెంట్‌గా ఉండేందుకు, గ్రీన్ కార్డు పొందేందుకు.. ఈబీ-5 వీసా కోసం తెగ పోటీపడుతున్నారు. హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డులపై.. ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించడంతో.. భారతీయులంతా ఈబీ-5 వీసా ప్రోగ్రామ్‌ని ఎంచుకుంటున్నారు. విపరీతంగా అప్లై చేస్తున్నారు. ఈ విషయంలో.. ఇండియా రెండో స్థానంలో ఉందంటే.. మనోళ్లకు అమెరికా అంటే మోజు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అసలు.. ఇండియన్స్ అంతా ఈబీ-5 వీసాపై ఎందుకు కన్నేశారు?


ఈబీ-5 ఇన్వెస్ట్‌మెంట్ వీసాని ఎంచుకుంటున్న భారతీయులు
అమెరికాకు వెళ్లి.. అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకొని.. కొన్నాళ్ల పాటు జాబ్ చేసి.. తర్వాత గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకునేంత ఓపిక ఇప్పుడు ఎవ్వరికీ ఉండట్లేదు. ఉన్న దేశం దాటి.. అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వాళ్లంతా.. ఇప్పుడు ఈబీ-5 ఇన్వెస్ట్‌మెంట్ వీసాని ఎంచుకుంటున్నారు. కాస్త ఎక్కువ డబ్బులున్నోళ్లంతా.. ఎక్కువ రోజులు ఆగట్లేదు. హెచ్1బీ వీసా హోల్డర్లు కూడా.. ఇప్పుడు ఈబీ5 వీసాలకు కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. అమెరికాలో వీసాల కోసం ఆంక్షలు పెరుగుతున్న క్రమంలో.. భారతీయులంతా ఈ ఈబీ-5 వీసా ప్రోగ్రామ్‌ని సెలక్ట్ చేసుకుంటున్నారు. దీనిద్వారా.. అమెరికాలో శాశ్వతంగా నివాస పొందాలని చూస్తున్నారు. ఈ వీసా ద్వారా 8 లక్షల డాలర్ల పెట్టుబడితో.. 10 ఉద్యోగాలు సృష్టిస్తే చాలు.. మొత్తం ఫ్యామిలీకి గ్రీన్ కార్డు ఇచ్చేస్తున్నారు. ఆ మధ్య అత్యంత సంపన్నుల కోసం ట్రంప్ గవర్నమెంట్.. 5 మిలియన్ డాలర్ల పెట్టుబడితో గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చింది. అంత డబ్బులు పెట్టలేని వాళ్లంతా.. ఈజీగా గ్రీన్ కార్డు పొందేందుకు.. ఈబీ-5 వీసా వైపు చూస్తున్నారు.

ఈబీ – 5 కోసం భారతీయుల నుంచి భారీగా దరఖాస్తులు
అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇప్పుడున్న ఈబీ-5 వీసా స్థానంలో ట్రంప్ తెస్తానన్న గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ ఇప్పటికీ పట్టాలెక్కలేదు. కానీ.. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం భారతీయులు ఎన్నడూ లేనంత ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా.. ఈబీ-5 వీసా కోసం భారతీయుల నుంచి దరఖాస్తులు పోటెత్తుతున్నాయ్. ఈ వీసా కోసం దరఖాస్తు చేస్తున్న విదేశీయుల్లో.. భారతీయులు రెండో స్థానంలో ఉన్నారంటేనే.. మనోళ్లకు అమెరికా అంటే ఎంత మోజు ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ప్రెసిడెంట్‌గా పగ్గాలు చేపట్టి.. వీసాలపై ఆంక్షలు విధించటానికి ముందు నుంచే.. ఈబీ-5 వీసాలకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు.. హెచ్1బీ, గ్రీన్ కార్డ్ సహా ఇతర ఇమ్మిగ్రేషన్ కేటగిరీల్లో.. రికార్డు స్థాయిలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం.. యూఎస్‌లో కోటీ 10 లక్షలకు పైనే ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో.. అమెరికాలో శాశ్వత నివాసానికి.. ఈబీ-5 వీసా ఓ వేగవంతమైన, నమ్మకమైన హామీగా మారిందని చెబుతున్నారు.


ఈబీ-5 వీసా కోసం ఫామ్ ఐ-526 పూర్తి చేయాలి..
అమెరికా గ్రీన్‌ కార్డు పొందడానికి ఈ ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వీసాయే.. అత్యుత్తమ మార్గమని.. ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా చెబుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్‌ వీసా నిబంధనలను కఠినతరం చేసిన తర్వాత.. చాలామంది భారతీయులు అమెరికాలో పెట్టుబడులకు సంబంధించిన ఈ ఈబీ5 వీసా ప్రోగ్రామ్‌ వైపు చూస్తున్నారు. దీని కోసం ఫామ్ ఐ-526 పూర్తి చేయాల్సి ఉంటుంది. అమెరికాలో టార్గెటెడ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఏరియాలో కనీసం 8 లక్షల డాలర్లు, ఇతర ప్రాంతాల్లో పదిన్నర లక్షల డాలర్లు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కనీసం.. 10 మంది అమెరికన్లకు పూర్తిస్ధాయి ఉద్యోగాలను అందించేలా సంస్ధను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అర్హత కలిగిన వారికి మొదట రెండేళ్లకు.. షరతులతో కూడిన గ్రీన్ కార్డు అందిస్తారు. ఆ తర్వాత.. ఐ-829 దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీని గురించి తెలిశాక.. భారతీయుల్లో కొత్త ఆశలు చిగురించాయ్. ముఖ్యంగా.. కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫైనాన్స్ లాంటి రంగాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు, హెచ్-1బీ వీసా హోల్డర్లలో ఈబీ-5 వీసా పట్ల ఆసక్తి పెరిగిందని చెబుతున్నారు.

తమ దేశానికి వెళ్లకుండానే అమెరికాలోని దరఖాస్తు
1992 నుంచి అమెరికా ఈబీ–5 వీసాలను జారీ చేస్తోంది. అమెరికన్లకు ఉద్యోగాల సృష్టి కోసం ఈ వీసా ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చారు. అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలు, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో.. 7 కోట్లు, మిగతా ప్రాంతాల్లో 9 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే విదేశీయులకు.. ఈబీ-5 గ్రీన్ కార్డులు ఇస్తారు. ఈ వీసా ఉంటే.. పెట్టుబడి పెట్టేవాళ్లు, వారి జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు ఉండే వారి పెళ్లికాని పిల్లలకు.. అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తారు. హెచ్‌–1బీ వీసాలపై ఉన్న విద్యార్థులు, పని చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తులు.. తమ దేశానికి వెళ్లకుండానే ఈబీ–5ని అమెరికాలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం యూఎస్‌లో హెచ్‌–1బీ, స్టూడెంట్ వీసా వంటి వలసేతర హోదాలపై ఉన్న భారతీయ పౌరులు, కొత్త నిబంధనల ప్రకారం ఐ–526E ఫామ్‌ని అప్లై చేస్తే.. 3 నుంచి 6 నెలల్లోపు.. వర్క్, ట్రావెల్ పర్మిట్‌లు వస్తాయి. ఈ పర్మిట్.. వారి ఈబీ-5 గ్రీన్ కార్డ్‌ ఆమోదం పొందేవరకు చెల్లుబాటు అవుతుంది. అందుకోసమే.. భారతీయులు ఇప్పుడు ఎక్కువగా ఈ వీసా కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఈబీ-5 వీసాని ఎవరు ఎంచుకుంటున్నారు? హెచ్1-బీ వీసా కంటే.. ఇది ఎందుకు బెటర్? ఒక్కసారి 7 కోట్లు చెల్లిస్తే.. పర్మినెంట్‌లో అమెరికాలో ఉండిపోవచ్చా? ట్రంప్ గవర్నమెంట్‌లో.. గ్రీన్ కార్డు కోసం లేనిపోని ఆంక్షల్ని, రూల్స్‌ని ఎవరు ఎదుర్కొంటారనుకునే వాళ్లంతా.. ఇప్పుడు ఈబీ-5 వీసానే ఎంచుకుంటున్నారా? ట్రంప్ గోల్డ్ కార్డ్ కంటే.. ఇదే బెటరా?

గోల్డ్ కార్డ్‌తో ఈజీ- 5 ప్రోగ్రామ్‌ని భర్తీ చేసి చేసే యోచన
ఈబీ-5 వీసా ప్రోగ్రామ్.. పెట్టుబడి ద్వారా అమెరికన్ గ్రీన్ కార్డ్ పొందేందుకు ఉన్న బెటర్ ఆప్షన్ అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. అయితే.. అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే వాళ్ల కోసం.. ప్రెసిడెంట్ ట్రంప్ గోల్డ్ కార్డ్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇది.. ఈబీ-5 ప్రోగ్రామ్‌ని భర్తీ చేసి.. గోల్డ్ కార్డ్ ద్వారా వచ్చే నిధులు నేరుగా అమెరిగా ప్రభుత్వానికే వెళ్లేలా చేయగలదన్నారు. గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్‌ ప్రవేశపెట్టేందుకు కావాల్సిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం కూడా చేశారు. గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికాలో స్థిరపడాలనుకునేవాళ్లంతా.. 43 కోట్లకు పైనే నేరుగా యూఎస్ గవర్నమెంట్‌కి చెల్లించాలి. అయితే.. గోల్డ్ కార్డ్‌కు సంబంధించిన విధివిధానాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అందువల్ల.. చాలా మంది ఈబీ-5 వీసా వైపు చూస్తున్నారు. ఇది.. వారి కుటుంబాలకు భవిష్యత్తుని సురక్షితం చేస్తుందని నమ్ముతున్నారు. అందుకే.. ఇండియా నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయ్. చాలా మంది తమ పిల్లలు యూఎస్ యూనివర్సిటీల్లో చేరిన తర్వాత.. వారు అక్కడే కెరీర్ నిర్మించుకోగలరని నమ్ముతున్నారు. ఏళ్లు గడిచేకొద్దీ.. హెచ్1బీ వీసా రూల్స్ కఠినతరమవుతున్నాయ్. దాంతో.. చాలా మంది ఈబీ-5 ద్వారా గ్రీన్ కార్డు పొందాలని చూస్తున్నారు.

పదేళ్ల కాలపరిమితితో ఈబీ – 5 వీసా గ్రీన్ కార్డు
ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ అప్లికేషన్ ఆమోదం పొందితే… యూఎస్ కాన్సులేట్‌లో ఓ ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు చేసిన వ్యక్తి.. అప్పటికే యూఎస్‌లో ఉంటే దానికి తగినట్లుగా ఈ వీసాని జారీ చేస్తారు. ఇది.. పదేళ్ల కాలపరిమితితో ఉంటుంది. తర్వాత.. దానిని రెన్యువల్ చేసుకోవాలి. 2022 నుంచి భారతీయుల నుంచి దాదాపు 1200 ఈబీ-5 అప్లికేషన్లు దాఖలయ్యాయ్. చైనా తర్వాత.. ఈ వీసాల కోసం అత్యధికంగా దరఖాస్తు చేస్తున్న రెండో దేశం ఇండియానే. చాలా మంది భారతీయులు ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో పూల్ క్యాపిటల్‌గా, మిగతా ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. డైరెక్ట్ ఎంటర్‌ప్రైస్ ఇన్వెస్ట్‌మెంట్‌తో పోలిస్తే.. ఇందులో రిస్క్ చాలా తక్కువ. ఇక.. కుటుంబం మొత్తానికి.. త్వరగా, సులభంగా గ్రీన్ కార్డ్ కావాలనుకుంటున్నారో.. వాళ్లంతా.. ఈబీ-5 వీసా వైపు చూస్తున్నారు. అమెరికాలో చదువు పూర్తయ్యాక, హెచ్1బీ వీసా లాటరీలతో విసిగిపోయి, గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల పాటు వెయిట్ చేయలేమని భావించే వాళ్లంతా.. పెట్టుబడి పెట్టి ఈ వీసా తీసుకుంటున్నారు. ఇక.. తమ వ్యాపారాన్ని అమెరికా రేంజ్‌కి విస్తరించాలనుకునే బిజినెస్ టైకూన్లు కూడా ఈబీ-5 వీసా కోసం అప్లై చేస్తున్నారు. అత్యంత సంపన్నులంతా.. సురక్షితమైన నివాసం కోసం, వారి పిల్లల ఉన్నత చదువుల కోసం ఈ వీసా ప్రోగ్రామ్‌ని ఎంచుకుంటున్నారు.

మొదట రెండేళ్లకు షరతులతో కూడిన గ్రీన్ కార్డు
హెచ్1బీ, ఎల్1 లాంటి ఇతర మార్గాల కంటే.. ఈ వీసాతో గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌కి తక్కువ సమయం ఉండటం వల్ల కూడా.. భారతీయులు ఎక్కువగా ఈబీ-5ని ఎంచుకుంటున్నారు. ఒక్కసారి అప్లికేషన్ అప్రూవ్ అయితే.. మొదట రెండేళ్లకు షరతులతో కూడిన గ్రీన్ కార్డు వస్తుంది. ఆ తర్వాత.. పెట్టిన పెట్టుబడి, ఉపాధి కల్పన చేశామని నిరూపించుకుంటే.. శాశ్వతంగా గ్రీన్ కార్డు ఇస్తారు. అందువల్ల.. ఒక్కసారి పెట్టుబడి పెట్టినంత మాత్రాన.. వెంటనే అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు గ్రీన్ కార్డు ఇవ్వరు. కానీ.. ట్రంప్ తెచ్చిన గోల్డ్ కార్డ్ అలా కాదు. ఒక్కసారి డబ్బులు చెల్లిస్తే.. అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవచ్చు.

Also Read: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

వాస్తవానికి.. ట్రంప్ ఆంక్షల భయంతోనే.. చాలా మంది ఈబీ5 వీసాని ఎంచుకుంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధమైన వలసలను తగ్గించడానికి.. హెచ్1బీ, ఇతర ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ మార్గాల్లో ఆంక్షలు పెంచింది. దాంతో.. హెచ్1బీ వీసాల రిజెక్షన్ రేటు పెరిగింది. మిగతా గ్రీన్ కార్డుల ప్రాసెసింగ్‌ ఆలస్యమవుతోంది. వీటికి మించి నిబంధనలు మరింత కఠినతరం కావడం లాంటివన్నీ చూశాక.. సంపన్నులు, భారతీయులు, హెచ్1బీ వీసాపై నమ్మకం కోల్పోయిన వాళ్లంతా.. ఈబీ5 వైపు మొగ్గు చూపుతున్నారు. ధనవంతులై ఉండి.. వేగంగా గ్రీన్ కార్డు కావాలనుకునే వారికి.. ఈబీ-5 వీసా ప్రోగ్రామ్.. సురిక్షితమైన ప్రత్యామ్నాయంగా మారింది. ట్రంప్ తెచ్చిన గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్.. కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది. అందువల్ల.. అనిశ్చితిని నివారించడానికి.. పెట్టుబడిదారులు, భారతీయులంతా.. ఈబీ-5 మార్గాన్నే సురక్షితమైనదిగా భావిస్తున్నారు.

Story By Anup, Bigtv

Related News

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పాక్-చైనా అణ్వాయుధ పరీక్షలు, వచ్చే ఏడాది కోసం గ్రౌండ్ ప్రిపేర్

Nepal Avalanche: నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌.. విరుచుకుపడిన హిమపాతం, ఏడుగురు మృతి

Big Stories

×