Sara -Shubman Gill: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India, 3rd T20I ) మధ్య రెండు రోజుల కిందట మూడో టి20 జరిగిన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఈ మ్యాచ్ విజయంతో 1-1 తేడాతో సిరీస్ సమం అయింది. ఇదంతా పక్కకు పెడితే, ఆస్ట్రేలియాలోని బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ ( Bellerive Oval, Hobart) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కు క్రికెట్ గార్డ్ సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండూల్కర్ ( Sara Tendulkar) కూడా హాజరయ్యారు. ఆమె మైదానానికి రావడంతో ఫోకస్ మొత్తం సారా టెండూల్కర్ పైనే పెట్టాడు కెమెరామెన్. ఇక సారా వచ్చిందని, బ్యాటింగ్ అదగొట్టాలని శుభమాన్ గిల్ (-Shubman Gill) కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయి, వికెట్ సమర్పించుకున్నాడు.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు. కేవలం 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సారా టెండూల్కర్ ఉందని కాస్త రెచ్చిపోయిన గిల్, ఓ బౌండరీ కూడా కొట్టాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ డీలా పడిపోయి వికెట్ సమర్పించుకున్నాడు. శుభమాన్ గిల్ వికెట్ కోల్పోవడంతో చాలా సీరియస్ లుక్ ఇచ్చారు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్. ఇక తన వికెట్ కోల్పోక ముందు మధ్యలో బ్రేక్ తీసుకొని, జెర్సీ విప్పి మరో జెర్సీ వేసుకున్నాడు. ఆ సమయంలో సారా టెండూల్కర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కూడా కెమెరా మాన్ క్యాప్చర్ చేశాడు. అయితే గిల్ జెర్సీ విప్పుతున్న నేపథ్యంలో… కళ్ళు మూసుకుంటూ, వీడు కొట్టిందే ఒక బౌండరీ.. దీనికే ఇంత బిల్డప్ అవసరమా ? అన్న రేంజ్ లో చూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సచిన్ టెండూల్కర్ గారల పట్టి సారా టెండూల్కర్, శుభమాన్ గిల్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. వారంలో ఒక్క రోజైనా, సారా టెండూల్కర్, శుభమాన్ గిల్ ఇద్దరి గురించి ఓ రూమర్ వైరల్ అవుతూ ఉంటోంది. దాదాపు 5 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. అయితే, ఎక్కడా కూడా దీనిపై స్పందించలేదు. ప్రేమించుకుంటున్నట్లు గానీ, ప్రేమలో లేనట్లుగానీ ఎక్కుడా రియాక్ట్ కాలేదు. ఎన్ని రకాల రూమర్స్ వచ్చినా, చీమ కుట్టినట్లు కూడా వ్యహరించడం లేదు. ఇది ఇలా ఉండగా, సారా- గిల్ ప్రేమ గురించి పక్కకు పెడితే, సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మాత్రం పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. త్వరలోనే సానియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
?igsh=ZXlxYzQ5anZxazYy