Amrita iyer (1)
Amritha Iyer Latest Photos: అమృత అయ్యర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. తమిళ నటి అయిన ఆమె రామ్ రెడ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అర్జునా ఫాల్గుణా, యాంకర్ ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Amrita iyer (8)
ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, నీలి నీలీ ఆకాశం.. పాటతో మాత్రం కుర్రకారు మతి దోచేసింది. ఈ పాట హిట్ తో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నారు. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది.
Amrita iyer (7)
ఆ తర్వాత ప్రశాంత్ వర్మ హనుమాన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు రికార్డు వసూళ్లు సాధించింది. దీంతో తెలుగులో ఆమె తొలి కమర్షియల్ హిట్ పడింది.
Amrita iyer (2)
దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ జాబితాలో చేరింది. హనుమాన్ హిట్ తో ఆమె ఫుల్ బిజీ అయిపోతుంది అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకు ఆమె నుంచి కొత్త సినిమా ప్రకటన లేదు. కనీసం సినిమాకు సంతకం చేసినట్టు కూడా వినిపించడం లేదు.
Amrita iyer (3)
తెలుగు, తమిళం ఇలా రెండు భాషల్లోనూ ఆమె పెద్దగా ఆఫర్స్ లేనట్టే కనిపిస్తుంది. అయితే మూవీ ఆఫర్స్ లేనప్పటికీ ఈ భామ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్ ని అలరిస్తుంది.
Amrita iyer (4)
తాజాగా అమృత తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఇండిగో బ్లూ లాంగ్ స్కర్ట్, క్రాప్ టాప్ హ్యాండ్ బ్లాక్ డ్రెస్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ముసి ముసిగా నవ్వుతూ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో అమృత స్మైల్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
Amrita iyer (5)
పాల బుగ్గలపై చిరునవ్వు చిందితే నెలవంక తొంగి చూసింది అంటూ కుర్రకారు కవిత్వాలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Amrita iyer (6)
క్యూట్ స్టైల్ మాయ చేస్తున్న అమృత అయ్యర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్