Bigg Boss 9 Promo: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా తెలుగులో తొమ్మిదవ సీజన్ ప్రారంభమయ్యింది. ఈరోజుతో ఆరు వారాలు పూర్తికాబోతోంది. పైగా దీపావళి సెలబ్రేషన్స్ హౌస్ లో మొదలయ్యాయి. నాగార్జున ఇచ్చే టాస్కులకు అటు కంటెస్టెంట్స్ తమదైన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి స్పెషల్ లో భాగంగా తమ మూవీ ప్రమోషన్స్ కోసం హీరో సుధీర్ బాబు(Sudheer Babu), నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) అక్క శిల్పా శిరోద్కర్(Shilpa Shirodkar) కూడా గెస్ట్లుగా విచ్చేశారు.
అలాగే హైపర్ ఆది (Hyper Adi) కూడా ఈ షోలో సందడి చేశారని చెప్పవచ్చు. సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు, కండువా ధరించి స్టేజ్ పైకి అడుగు పెట్టిన ఈయన.. మాటలతో పంచులతో అదరగొట్టేశారు. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ విసిరిన పంచులు చూసి ఇది కదా అసలైన దీపావళి.. ఆది డైలాగులు ఒక్కొక్కటి టపాసుల పేలుతున్నాయి అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రోమో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
తాజాగా 42వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇక ప్రోమో మొదలవ్వగానే జటాధర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు తోపాటు హీరోయిన్స్ కూడా స్టేజ్ పైకి వచ్చారు. అయితే ఇక్కడ సుదీర్ బాబు త్రిశూలం పట్టుకొని రావడంతో హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ.. ఈ త్రిశూలం ఎందుకు అని ప్రశ్నించాడు.. దీనికి సుధీర్ బాబు మాట్లాడుతూ.. “కొన్ని దయ్యాలతో మనం ఎంత యుద్ధం చేసినా సరిపోదు. మనకు ఒక ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి.. అదే ఇది” అంటూ తెలిపారు. ఇక తర్వాత టాప్ లేచిపోద్ది అనే సాంగ్ కి సుమన్ శెట్టి అదరగొట్టేలా డాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
ALSO READ:Hero Darshan: మళ్లీ సంకటంలో పడ్డ హీరో దర్శన్.. ఉన్నత న్యాయస్థానం మండిపాటు!
తర్వాత హైపర్ ఆది ఎంట్రీ.. వైల్డ్ కార్డ్స్ రాకముందు ఈ సీజన్ తగ్గేదెలా.. ఒకసారి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చాక అసలు తగ్గేదేలే అంటూ డైలాగ్ తో మొదలు పెట్టేశారు ఆది. నాన్నా అని పిలవాలని కూతురు.. అన్నయ్య అని పిలవాలని చెల్లెలు.. మావయ్య అని పిలవాలని అల్లుడు.. ఇంకా అల్లాడిపోతున్నార్రా బాబోయ్ .. రేపు సంక్రాంతికి రాబోయే ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి కదా.. వాళ్లు కూడా ఇంతకంటే మంచి ఫ్యామిలీ డ్రామా తీయగలమా అని డైలమాలో పడిపోయారు. అంటూ డైలాగులు విసిరారు ఆది. సంజనను ఉద్దేశిస్తూ.. ఏరోజైతే ఇమ్ము నిన్ను అమ్మా అని పిలిచాడో.. ఆ రోజు నుంచి వాడికి బొమ్మ కనబడుతూనే ఉంది. ప్రతి ఒక్కరు ఇమ్ము.. అమ్మ గొడవ పడుతోంది.. అమ్మ ఎవరైనో తిడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. రేయ్ బయట మీ అమ్మ కూడా కన్ఫ్యూజ్ అవుతోంది అసలు అమ్మ నేనా సంజన అని.. దివ్య నికితతో మాట్లాడుతూ.. ఫ్యామిలీ డ్రామాలోకి ఒక చిన్న క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉంటాయి కదా.. సంక్రాంతి సినిమాలో సంగీత, శివరామరాజులో లయ, సీజన్ 9 లో దివ్య అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికి అయితే ఆది వచ్చాక హౌస్ లో మరింత ఫన్ మొదలైందని చెప్పవచ్చు.