BigTV English

Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ కి గెస్ట్ గా హిందీ కంటెస్టెంట్.. ఆమె ఇచ్చిన సలహా విన్నారా?

Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ కి గెస్ట్ గా హిందీ కంటెస్టెంట్.. ఆమె ఇచ్చిన సలహా విన్నారా?
Advertisement

Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఎవరు ఎక్కువ కాలం హౌసులో ఉంటారు అని ఊహిస్తున్నామో.. వాళ్లే బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఖచ్చితంగా ఇది రణరంగం అనే అభిప్రాయం కలుగుతుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి అరిచినా కూడా శ్రీజ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆవిడ బయటికెళ్ళిపోయింది. హౌస్ లో రేలంగి మావయ్యలా మంచితనాన్ని చూపిస్తూ అందరితో కలివిడిగా ఉన్న భరణి కూడా నేడు బయటకు వచ్చేసాడు.


ఇకపోతే ప్రతి ఆదివారం నాగర్జున వచ్చి కంటెస్టెంట్లతో సందడి చేయడం అనేది కామన్ గా జరుగుతుంది. అలానే బిగ్ బాస్ కి విపరీతమైన ఆదరణ లభిస్తుంది కాబట్టి చాలామంది చిత్ర యూనిట్లు కూడా వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేస్తారు. లాస్ట్ వీక్ తెలుసు కదా, డ్యూడ్, కే ర్యాంప్ వంటి సినిమా యూనిట్స్ వచ్చి వాళ్ళ సినిమా గురించి సీజన్ 9 లో ప్రమోట్ చేసుకున్నారు.

బిగ్ బాస్ కి నమ్రత శిరోద్కర్ సిస్టర్..

ఈవారం జటాధరా సినిమా టీమ్ వచ్చి సందడి చేశారు అందులో నమ్రత శిరోద్కర్ చెల్లి శిల్పా శిరోద్కర్ కూడా హాజరయ్యారు. నిజానికి నమ్రత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఒక నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంది. మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం తన లైఫ్ ను కుటుంబానికి అంకితం చేసింది. ప్రతి మగాడు విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. అదేవిధంగా మహేష్ బాబు నేడు సాధిస్తున్న విజయాల వెనుక నమ్రత శిరోద్కర్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


నమ్రత శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కూడా నటిగా మంచి గుర్తింపు సాధించుకుంది. ఈవిడ ప్రస్తుతం సుదీర్ బాబు నటిస్తున్న జటాధర సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపిస్తోంది . ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు బిగ్ బాస్ 9లో చిత్ర యూనిట్ తో పాటు గెస్ట్ గా హాజరయ్యారు. గతంలో ఆవిడతో పని చేసిన అనుభవాన్ని నాగర్జున కూడా చెప్పారు.

ALSO READ:Bigg Boss 9 Promo: పంచ్ ల వర్షం కురిపించిన ఆది..ఇది కదా అసలైన దీపావళి!

తెలుగు కంటెస్టెంట్లకు సలహాలు

శిల్పా శిరోద్కర్ కేవలం నటిగానే కాకుండా బిగ్ బాస్ సీజన్ 18 హిందీలో పాల్గొంది. అయితే బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది అని తనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి. బిగ్ బాస్ షో కి వచ్చి కంటెస్టెంట్లకు ఎటువంటి సలహాలు ఇస్తుంది. షో గురించి ఎటువంటి అనుభవాలను తెలియజేస్తుంది అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన బిగ్ బాస్ ప్రోమో లో కూడా జటాధర చిత్ర యూనిట్ వచ్చినట్లు చూపించారు. అసలు బిగ్ బాస్ 9 లో వీళ్ళు ఏం మాట్లాడారు అనేది నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో తెలుస్తుంది.

Related News

Bigg Boss 9 Promo: పంచ్ ల వర్షం కురిపించిన ఆది..ఇది కదా అసలైన దీపావళి!

Bigg Boss Srija: తేరుకోలేకపోతున్న శ్రీజ.. జాబ్ కూడా వదిలేసా అంటూ ఎమోషనల్!

Bigg Boss 9: దీపావళి స్పెషల్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్!

Bigg Boss: హౌస్ లో కుల వివక్షత.. ఇదెక్కడి గోలరా బాబు!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ నుంచి భరణి అవుట్.. 6 వారాలకు ఎంత సంపాదించాడంటే?

Bigg Boss 9: మాధురి కోరిందే జరిగింది.. ఫుడ్ మానిటర్ ఛేంజ్, తనూజ కళ్లు తెరిపించిన నాగ్

Emmanuel : గోల్డెన్ స్టార్ రాగానే పోగరు పెరిగిందా.. నీకు పగిలిపోద్ది.. ఇమ్మూకి నాగ్ వార్నింగ్

Big Stories

×