BigTV English

Almonds: పొరపాటన కూడా బాదంతో పాటు ఇవి తినొద్దు !

Almonds: పొరపాటన కూడా బాదంతో పాటు ఇవి తినొద్దు !
Advertisement

Almonds: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా.. మన ఆహారంలో భాగంగా ఉండే బాదంపప్పు లాంటి పోషకాలు అధికంగా ఉండే వాటిని సరైన ఆహార పదార్థాలతో కలిపి తినడం వల్ల పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. కానీ.. కొన్ని రకాల ఆహారాలను బాదంతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, పోషకాల శోషణలో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార శాస్త్రం ప్రకారం.. బాదంతో ఎప్పుడూ కలపకూడని ఆహార పదార్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


బాదంపప్పుతో కలిపి తినకూడని ముఖ్యమైన ఆహారాలు:

పాల ఉత్పత్తులు & బాదం: చాలా మంది బాదం పాలు, స్మూతీస్ లేదా పాలతో చేసిన వంటకాలలో బాదంను కలిపి తింటారు. ఆయుర్వేదం ప్రకారం.. పాల ఉత్పత్తులు, సీడ్స్ లో పోషకాలు వేరుగా ఉంటాయి. పాలలో ఉండే కేసిన్ అనే ప్రోటీన్, బాదంలో ఉండే ఐరన్, మెగ్నీషియం వంటి కొన్ని పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ కలయిక అజీర్ణం, ఉబ్బరం లేదా శ్లేష్మం ఉత్పత్తిని పెంచడానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే.. బాదం తిన్న తర్వాత కొంత సమయం గ్యాప్ ఇచ్చి పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.


పుల్లని పండ్లు లేదా సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, ద్రాక్షవంటి పుల్లని పండ్లలో సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. బాదంలో కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్ , కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పుల్లని ఆహారాల ఆమ్ల స్వభావం బాదం జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది. అందుకే వీటిని వేరువేరుగా.. వేరే వేరే సమయాల్లో తినడం ఉత్తమం.

అధిక ఆక్సలేట్ కలిగిన ఆహారాలు: బాదంలో సహజంగానే ఆక్సలేట్స్ ఉంటాయి. పాలకూర , బీట్‌రూట్ , చిలగడదుంప వంటి అధిక ఆక్సలేట్ ఉన్న ఆహారాలతో బాదంను కలిపి తీసుకుంటే.. శరీరంలో ఆక్సలేట్ లోడ్ పెరుగుతుంది. అధిక ఆక్సలేట్స్ కాల్షియంతో కలిసి కాల్షియం-ఆక్సలేట్ రాళ్లను ఏర్పరుస్తాయి. ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

శుద్ధి చేసిన చక్కెరలు : బాదంను తరచుగా శుద్ధి చేసిన చక్కెరలు కలిపిన స్వీట్లు లేదా డెజర్ట్‌లలో ఉపయోగిస్తారు. బాదం సహజంగానే ఆరోగ్యకరమైన కొవ్వులు, కేలరీలను కలిగి ఉంటుంది. దీనికి శుద్ధి చేసిన చక్కెరను కలపడం వల్ల మొత్తం కేలరీల, గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి అంతే కాకుండా రక్తంలో చక్కెర సమతుల్యత దెబ్బతినడానికి దోహదపడుతుంది. దీనికి బదులుగా.. తేనె, ఖర్జూరం లేదా బెల్లం వంటి సహజ స్వీటెనర్లను కొద్ది మొత్తంలో ఉపయోగించడం మేలు.

Also Read: ఒక్క పౌడర్‌తో బోలెడు లాభాలు.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

ఎక్కువ ఉప్పు కలిగిన స్నాక్స్ : బాదంను అధిక సోడియం కలిగిన చిప్స్, ప్యాక్ చేసిన సాల్టీ క్రాకర్ల వంటి వాటితో కలిపి తినకూడదు. బాదంలో సహజంగా ఉప్పు తక్కువగా ఉంటుంది. వీటిని ఉప్పు ఎక్కువగా ఉన్న స్నాక్స్‌తో కలపడం వల్ల శరీరంలో సోడియం అధికమవుతుంది. ఇది గుండె ఆరోగ్యం, ద్రవాల నిలుపుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

బాదంపప్పును నానబెట్టి పై తొక్క తీసి తినడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది. అంతే కాకుండా పోషకాల శోషణ మెరుగుపడుతుంది. బాదం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందడానికి.. పైన పేర్కొన్న ఆహార పదార్థాలను దానితో కలిపి తీసుకోకుండా ఉండటం, వాటిని వేర్వేరు సమయాల్లో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Related News

Bathing: స్నానం ఎంతసేపు చెయ్యాలి? స్నానానికి ఉన్న అసలు ప్రాముఖ్యం ఇదే!

Sleeping without pillow: దిండు లేకుండా నిద్రపోతే శరీరానికి జరిగే అద్భుత మార్పులు ! తెలుసుకుంటే ఇకపై దిండు వేసుకోరేమో!

Memory: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తినండి..

Dry Skin: డ్రై స్కిన్ సమస్యా ? ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్

Cracked Heels:పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం.. వీటితో అద్భుతమైన రిజల్ట్

Moringa Powder For hair : ఒక్క పౌడర్‌తో బోలెడు లాభాలు.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Diwali First-Aid Guide: పండగ సమయంలో కాలిన గాయాలా ? ఇలా చిట్కాలు పాటించండి

Big Stories

×