Prashanth Neel : తెలుగు సినిమా ఏ స్థాయికి ఎదిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద దర్శకులు కూడా వచ్చి తెలుగు సినిమా హీరోలతో సినిమా చేయాలని కలలు కంటున్నారు. అలానే వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మన హీరోలను డైరెక్ట్ చేయడం మొదలు పెడుతున్నారు.
అలానే మరి కొంతమంది డైరెక్టర్స్ కూడా తమిళ్ హీరోలను తీసుకొని సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో తెలుగు తమిళ్ అని తేడా లేకుండా హీరోలతో పనిచేయటమే కామన్ గా మారిపోయింది. కే జి ఎఫ్ సినిమాతో ఒక ప్రభంజనం సృష్టించాడు ప్రశాంత్ నీల్. ఎమోషన్ తో పాటు ఎలివేషన్ కూడా భారీ స్థాయిలో చూపించే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు.
క్రేజీ కాంబినేషన్స్
కే జి ఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ అనే పేరు ఒక బ్రాండ్ అయిపోయింది. ఇక ప్రభాస్ హీరోగా బాహుబలి తర్వాత చేసిన సినిమాలేవి సరైన సక్సెస్ అందుకోలేకపోయాయి. ఆ తరుణంలో సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బీభత్సమైన హిట్ ఇచ్చాడు. ప్రభాస్ ను ఎలా చూస్తే అభిమానులు ఇష్టపడతారో అలా చూపించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో సలార్ 2 సినిమా కూడా చేయాల్సి ఉంది. సలార్ 2 షూటింగ్ సగం అయ్యాక మాత్రమే నెక్స్ట్ సినిమా లాక్ చేస్తారు…అది దిల్ రాజుకి అవుతుందా?, దానయ్యకి అవుతుందా?…లేదా ఇంకెవరికయినా చేస్తారా అనేది తెలియదు…ముందు అల్లు అర్జున్ అంటున్నారు,ఇప్పుడు రామ్ చరణ్ అంటున్నారు. చెప్పుకోడానికి మాత్రం ఈ కాంబినేషన్స్ బాగున్నాయి. కానీ ప్రశాంత్ నీల్ ఎవరితో వర్కౌట్ చేస్తారు అనేది ఇప్పట్లో క్లారిటీ రాదు.
భారీ ఎక్స్పెక్టేషన్స్ డ్రాగన్
ప్రశాంత్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేశారు అనే వార్తలు వినిపించాయి. అయితే ఒక తరుణంలో ఎస్ ఎస్ రాజమౌళి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా గురించి నేను ఎదురు చూస్తున్నాను అన్నారు. అక్కడితో సినిమా టైటిల్ అదే అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ విపరీతంగా కష్టపడుతున్నారు. చాలా బరువు కూడా తగ్గిపోయారు. బయట ఎన్టీఆర్ ను చూస్తుంటే ఒక పేషెంట్ లా కనిపిస్తున్నారు. సినిమా కోసం ఎంత కష్టం పడడానికైనా ఎన్టీఆర్ సిద్ధపడతాడు అనేది గత సినిమాలు తో కూడా ఆల్రెడీ ప్రూవ్ అయింది. అసలు ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తేనే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. నిజమైన డ్రాగన్ సినిమా మీద అందరికీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
Also Read: రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలుకా ఫస్ట్ సింగిల్ వచ్చేసింది, ఎలా ఉందంటే.?