Samantha: సినీనటి సమంత(Samantha) ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. సినిమాలను కాస్త తగ్గించిన సమంత ఎక్కువగా వెబ్ సిరీస్ ల పైనే ఫోకస్ పెట్టారు. వెండితెరకు దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా సమంత ఢిల్లీలో జరిగిన వరల్డ్ సమ్మిట్ కార్యక్రమంలో ఇటీవల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత తన కెరియర్ గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజాగా సమంత తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలిపారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలలో నా పాత్రలన్నీ కూడా చాలా మంచి పాత్రలే అని తెలిపారు. నేను సెక్సీగా కనిపిస్తానని ఎప్పుడూ నాకు అనిపించలేదు అలాగే నేను పని చేసిన డైరెక్టర్లు కూడా ఎప్పుడు నాకు బోల్డ్ పాత్రలలో నటించమని చెప్పలేదు. సినిమాల విషయంలో తాను ఎప్పుడూ ఒకే విషయాన్ని పాటిస్తాను నేను ఏ పాత్రకు కమిట్ అయిన ఆ పాత్ర కోసం 100% కష్టపడతానని తెలిపారు. నాకు తెలిసింది డెడికేషన్ తో పనిచేయటం మాత్రమే అంటూ సమంత తాజాగా బోల్డ్ పాత్రల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సమంత తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఏ సినిమాలో కూడా బోల్డ్ గా కనిపించలేదని చెప్పాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో తన ఫ్యామిలీ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా సమంత తెలియచేశారు. ఒకానొక సమయంలో నా కుటుంబం కనీసం భోజనం చేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడిందని తెలిపారు. నా మొదటి సినిమా తరువాత వచ్చిన పేరు సంపద నాకు ఒక లక్ష్యాన్ని గుర్తు చేశాయని, నేను కూడా నా లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేశానని సమంత వెల్లడించారు. మనలో నిజాయితీ అనేది ఎప్పుడు కూడా మన పెంపకం పైనే ఆధారపడి ఉంటుందని, ఎప్పుడైతే మనం నిజాయితీని కోల్పోతామో మనలో అప్పుడు అస్థిరత వస్తుందని తెలిపారు.
సోషల్ మీడియాని భాధ్యాయుతంగా వాడాలి..
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం గురించి కూడా సమంత మాట్లాడారు. ఎంతోమంది సోషల్ మీడియాని మంచి మార్గాల కంటే ఎక్కువగా చెడు మార్గాలకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు అయినా సాధారణ వ్యక్తులైన సోషల్ మీడియాను చాలా బాద్యతంగా ఉపయోగించుకోవాలి అంటూ సమంత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక సమంత చివరిగా ఖుషీ సినిమా ద్వారా వెండితెరపై తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. ఈ సినిమా తరువాత సమంత హీరోయిన్ గా ఇప్పటివరకు ఎలాంటి సినిమాలలో నటించలేదు. త్వరలోనే మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్ పనులలో సమంత బిజీ కాబోతున్నట్టు తెలుస్తోంది.