BigTV English

Constable Notification: 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. బంగారం లాంటి భవిష్యత్తు, ఇంకా 2 రోజులే..!

Constable Notification: 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. బంగారం లాంటి భవిష్యత్తు, ఇంకా 2 రోజులే..!
Advertisement

Constable Notification: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీగా ఢిల్లీ పోలీస్ సర్వీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.


స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌.. 7,565 ఢిల్లీ పోలీస్‌ సర్వీస్‌ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌) ఖాళీల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 21 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోట్: దరఖాస్తుకు ఇంకా 2 రోజులే


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 7565

పోస్టులు – వెకెన్సీలు..

కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు: 4,408 పోస్టులు

కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు: 2,496 పోస్టులు

కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [ఎక్స్-సర్వీస్‌మెన్ (ఇతరులు)]: 285 పోస్టులు

కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [ఎక్స్-సర్వీస్‌మెన్ (కమాండో)]: 376 పోస్టులు

విద్యార్హత: అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (సీనియర్ సెకండరీ) పాసై ఉంటే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: సెప్టెంబర్ 22

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 21

దరఖాస్తు సవరణ తేదీలు: 29.10.2025 – 31.10.2025.

ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుమారులు, కుమార్తెలు, బ్యాండ్స్‌మెన్, బగ్లర్స్, మౌంటెడ్ కానిస్టేబుల్స్ తదితరులకు అర్హతలో అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులు తప్పనిసరిగా పీఈ&ఎంటీ తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే ఎల్‌ఎంవీ (మోటార్ సైకిల్ లేదా కారు) డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

వయస్సు: 2025 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగానికి సెలక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.21,700- రూ.69,100 వరకు జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్ డ్ పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్, మెజర్‌మెంట్ టెస్ట్ (PE&MT), మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 7565

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 21

ALSO READ: SSC Constable: ఇంటర్ పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఇంకా 2 రోజులే

Related News

RRC JOBS: ఇండియన్ రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు, డోంట్ మిస్

TGCAB Staff Assistant Posts: టీజీ క్యాబ్ బ్యాంకుల్లో 225 అసిస్టెంట్ పోస్టులు.. డిగ్రీ అర్హత గల వారికి గుడ్ ఛాన్స్

SSC Constable: ఇంటర్ పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఇంకా 2 రోజులే

NER Jobs: రైల్వేలో 1104 అప్రెంటీస్ పోస్టులు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ONGC Jobs: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. ఓఎన్‌జీసీలో 2623 ఉద్యోగాలు.. నెలకు రూ.12,300 స్టైఫండ్

EMRS Jobs: 7267 ఉద్యోగాలు బ్రో.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, కొంచెం కష్టపడితే జాబ్ మీదే

BEL Notification: నిరుద్యోగులకు పండుగే.. బెల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్, నెలకు రూ.90వేల జీతం

Big Stories

×