Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ప్రస్తుతం కె ర్యాంప్ (K-Ramp)సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 18 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కిరణ్ అబ్బవరం సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కిరణ్ అబ్బవరం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఓజి సినిమా ప్రీమియర్లలో కిరణ్ అబ్బవరం సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఇలా పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానాన్ని చాటుకుని కిరణ్ అబ్బవరం తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మీకు క్యామియో పాత్రలలో నటించే అవకాశం వస్తే నటిస్తారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. కిరణ్ అబ్బవరం సమాధానం చెబుతూ.. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడం కోసం కష్టపడుతున్నాను ఇలాంటి సమయంలో ఇతర సినిమాలలో క్యామియో పాత్రలలో అసలు నటించనని తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చిన తాను రిజెక్ట్ చేస్తానని తెలిపారు. కేవలం కిరణ్ అబ్బవరం మాత్రమే నటించగలిగే పాత్ర ఉంటే చేస్తాను తప్ప పవన్ కళ్యాణ్ సినిమా అని మాత్రం నటించను అంటూ కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాలేజీ చదివే సమయంలో తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని, ఆయన సినిమా వస్తుంది అంటే బ్యానర్లు కూడా కట్టామని తెలిపారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి నేను అడుగు పెట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, ఒక అభిమానిగా మాత్రమే కాకుండా, ఒక హీరోగా నా కెరియర్ ను నిర్మించుకొనే పనిలో బిజీగా ఉన్నాను అంటూ ఈయన తన సినీ కెరియర్ గురించి వెల్లడించారు.
క్యామియో పాత్రలలో నటించను..
ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం గురించి కిరణ్ అబ్బవరం చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ హీరోలు కూడా క్యామియో పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం నటించనంటూ చేసిన ఈ కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా నిలదొక్కుకుంటూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది క సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా కె ర్యాంప్ సినిమా ద్వారా మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు.
Also Read: Samantha: డైరెక్టర్లు కూడా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. బోల్డ్ కామెంట్స్ చేసిన సమంత!