Amyra Dastur: టాలీవుడ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది హీరోయిన్ అమైరా దస్తూర్. కావాల్సినంత గ్లామర్ ఉన్నా, ఎందుకోగానీ కనెక్ట్ కాలేకపోతోంది.
గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం గడిచిపోయింది. కాకపోతే చెప్పుకోవడానికి తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న మూవీ ఒక్కటీ చేయలేకపోతోంది.
సమ్‌థింగ్ కారణం ఏమైనా కావచ్చు అనుకోండి.. అరకొరగా హిందీ సినిమాలు చేస్తున్నా ఎలివేట్ కాలేకపోతోంది.
రీసెంట్‌గా పంజాబీ మూవీ వైపు కన్నేసింది. అక్కడా పర్వాలేదనిపించింది.
మూడు పదుల వయసొచ్చినా, ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
వయస్సు శరీరానికేనని, మనసుకు కాదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్‌గా అదిరిపోయేలా ఫోటోషూట్ ఇచ్చింది.
అందులో ఆమె అందాన్ని వర్ణించలేము. సింపుల్ గా చెప్పాలంటే యూత్ కి కావాల్సిన వసందైన విందు అందులో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ విధంగానైనా సౌత్‌లో ఆమె కెరీర్ ఊపందుకుంటుందేమో చూడాలి. ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.