Bigg Boss 9 Telugu Day 59 : ఆడియన్స్ కు ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను ప్లాన్ చేశారు బిగ్ బాస్. అందులో భాగంగా ఇప్పటికే సీక్రెట్ టాస్క్ పేరుతో సుమన్ శెట్టి, దివ్యలతో దొంగతనం చేయించారు. ఇక ఇప్పుడు హౌస్ మేట్స్ ను. భయపెట్టడానికి ‘ఘోస్ట్ రూమ్’ టాస్క్ ను ప్లాన్ చేశారు. బిగ్ బాస్ డే 59 ఎపిసోడ్ 60లో నిన్నటి రోజు జరిగిన పాల దొంగతనంతో గందరగోళం నెలకొంది. ఆ పాలను దొంగతనం చేసిన దివ్య, సుమన్ శెట్టి ఏమీ ఎరుగనట్టుగా ఉదయాన్నే హౌస్ మేట్స్ తో కలిసి పాలను వెతకడం మొదలు పెట్టారు.
ఇక హౌస్ లో ఆరెంజ్, పింక్, బ్లూ టీంలుగా కంటెండర్ టాస్క్ కోసం పోటీ పడుతుండగా, నేటి ఎపిసోడ్ లో ‘స్మెల్ ఇట్ టచ్ ఇట్ గెస్ ఇట్’ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఆరెంజ్ టీం నుంచి తనూజా, బ్లూ టీం నుంచి రీతూ, పింక్ టీం నుంచి దివ్య పాల్గొన్నారు. మొదట్లో భయపడి, బోరున ఏడ్చిన తనూజానే ఈ టాస్క్ లో విన్ అయ్యి, అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ టాస్క్ లో బాగా ఎంటర్టైన్ చేసింది మాత్రం రీతూనే. భయపడుతూనే ఆకట్టుకుంది రీతూ. దివ్య ఏమాత్రం భయపడకుండా టాస్క్ ఆడింది.
ఈ గొడవకు కారణం ఆమ్లెట్. నిఖిల్ ఆమ్లెట్ అడగ్గా, ఆ టైమ్ లో కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న గౌరవ్ గుప్తా వాష్ రూమ్ లో ఉన్నాడు. దీంతో కెప్టెన్ దివ్య గౌరవ్ టైమ్ కి అందుబాటులో ఉండడు అంటూ ఫైర్ అయ్యింది. అలాగే రేషన్ మేనేజర్ రీతూ కూడా చెప్పిన మాట వినట్లేదు అంటూ గౌరవ్ ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి పీకేయమంది. ఈ ఆమ్లెట్ గొడవ కోపాన్ని కాస్తా రేషన్ మేనేజర్ రీతూ చౌదరిపై తీశాడు గౌరవ్. కెప్టెన్ దివ్యతో పాటు హౌస్ మేట్స్ అందరినీ కూర్చోపెట్టుకుని పాల దొంగతనంలో తప్పు ఎవరిది ? అంటూ రీతూను టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు.
కానీ ఆమె రేషన్ మేనేజర్ గా బాగానే చేస్తోంది. మార్చేంత తప్పు ఏదీ చేయలేదు. పాల దొంగతనం విషయానికొస్తే నిద్ర పోకుండా చూస్తూ ఎవ్వరూ కూర్చోరు. దానికి ఆమె ఎలా బాధ్యురాలు అవుతుంది? అదే ప్లేస్ లో నువ్వుంటే ఏం చేస్తావ్? అంటూ తిరిగి ప్రశ్నించింది దివ్య. దానికి గౌరవ్ “నేను బాధ్యత తీసుకుంటా” అని సమాధానం చెప్పాడు. దీంతో రీతూ – గౌరవ్ మధ్య రచ్చ మొదలైంది. రీతూ చౌదరి అతనికి స్ట్రాంగ్ గా ఇచ్చిపడేసింది. కిచెన్ టీమ్ వద్దు అంటున్నావ్ కాబట్టి వాష్ రూమ్ తీసుకో. లేదంటే ఫుడ్ ఉండదు అంటూ గౌరవ్ కు వార్నింగ్ ఇచ్చింది దివ్య. దీంతో గౌరవ్ గట్టిగా హర్ట్ అయ్యి, వాష్ రూమ్ చెయ్యను అని ఎదురు తిరిగాడు.
Read Also : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం
ఈ క్రమంలోనే బిగ్ బాస్ రెబల్స్ ఎవరో చెప్పమన్నారు. హౌస్ లో ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు. బిగ్ బాస్ స్వయంగా ఎక్కువ మంది ఎవరిపేరు చెబితే వాళ్లను గేమ్ నుంచి తీసేస్తా అన్నాడు. దీంతో అందరూ కావాలనే గంపగుత్తగా డెమోన్ కు ఓటు గుడ్డేశారు. ఫలితంగా డెమోన్ కెప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ అయ్యాడు. అలాగే డెమోన్ ను రెబల్స్ కంటెండర్ టాస్క్ నుంచి తీసేయడంతో తనూజా – రీతూకి కూడా పడింది. డెమోన్ తో పాటు నిఖిల్, సంజన, కళ్యాణ్ కూడా ఈ టాస్క్ నుంచి అవుట్ అయ్యారు.