RCB ON SALE: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( royal challengers bengaluru) జట్టు అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ జట్టును అమ్మకానికి ఉంచినట్లు నేషనల్ మీడియాలో ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే ఈ జట్టును అమ్మేందుకు డియాగో కంపెనీ ( United Spirits Ltd ) సిద్ధమైనట్లు వచ్చిన వార్త నిజమేనని తాజాగా తేలింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. మార్చి 31వ తేదీ 2026 నాటికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ కూడా రాబోతున్నాడట. ఈ మేరకు సేల్ ప్రక్రియను బెంగళూరు జట్టు ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది. ఈ విషయం వైరల్ కావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు షాక్ అవుతున్నారు. 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును అమ్మడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
18 సంవత్సరాల తర్వాత ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును భరించే శక్తి లేక డియాగో కంపెనీ విక్రయించేందుకే సిద్ధమైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సేల్ ప్రక్రియ మొదలైందని కూడా చెబుతున్నారు. మార్చి 31 2026 నాటికి కొత్త ఓనర్ రాబోతున్నాడట. ఈ జట్టును కొనుగోలు చేసేందుకు అదానీ, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, JSW గ్రూపు కంపెనీ కూడా సిద్ధమైనట్లు వార్తలు కూడా వచ్చాయి. వీరిలో ఎవరో ఒకరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసే ఛాన్సులు ఉన్నాయట. విదేశాలకు చెందిన మరో రెండు కంపెనీలు కూడా ముందడుగు వేస్తున్నాయని తెలుస్తోంది. ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేయాలంటే రెండు బిలియన్ డాలర్స్ అవసరం అవుతాయి. అంటే రూ.17,600 కోట్లు చెల్లించి ఈ జట్టును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండడం అలాగే మొన్ననే ఛాంపియన్ అయిన నేపథ్యంలో బెంగళూరు జట్టుకు ఇంత మొత్తంలో డబ్బు కట్టాల్సి ఉంటుందట.
ఇక సేల్ చేసే నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ కు ఇచ్చిన సమాచారంలో పేరెంట్ కంపెనీ డిఆర్ఓ ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం అందుతోంది. ఇదే జరిగితే ఖచ్చితంగా వచ్చే సీజన్ మధ్యలోనే రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ రాబోతున్నాడు. మార్చి 15వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మార్చి 31వ తేదీ వరకు బెంగళూరు జట్టును కొత్త ఓనర్ కు అప్పగిస్తారు. అంటే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మధ్యలోనే బెంగళూరుకు కొత్త యజమాని వస్తారు. పనిలో పనిగా WPL జట్టును కూడా సేల్ చేసేందుకే సిద్ధమయ్యారట. Wpl 2027 నాటికి ఆ జట్టుకు కూడా కొత్త ఓనర్ వస్తాడు. ఈ రెండు జట్లను ఒకరి కొనుగోలు చేసే ఛాన్సులు ఉన్నాయి.
RCB has been put up on Sale pic.twitter.com/MeIdtctgxe
— RVCJ Media (@RVCJ_FB) November 5, 2025