Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ప్రస్తుతం తమిళ సినిమాలను మాత్రమే కాకుండా తెలుగు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరస భాష సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది. ఇది వరకు మణిరత్నం విజయ్ సేతుపతి కాంబినేషన్లో “చెక్క చివంద వానమ్” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 2018 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన జ్యోతిక నటించారు. ఇక ఈ సినిమాని నవాబ్ పేరిట తెలుగులో కూడా విడుదల చేశారు.
ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. త్వరలోనే వీరి కాంబోలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే మణిరత్నం చెప్పిన కథకు విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇదివరకు వచ్చిన సినిమాలు మాదిరిగా కాకుండా సరికొత్త జోనర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ప్రస్తుతం విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ (Puri Jagannadh)దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయిన అనంతరం ఈయన మణిరత్నం డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు. ఇక పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకు “స్లమ్ డాగ్” (Slum Dog)అనే టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా సంయుక్త మీనన్ నటించబోతున్నారు అలాగే సీనియర్ నటి టబు కూడా ఈ సినిమాలో భాగం కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కాగానే విజయ్ సేతుపతి మణిరత్నం సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇక మణిరత్నం సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఈయన డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా థగ్ లైఫ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో సినిమా అంటే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.
నిరాశపరిచిన థగ్ లైఫ్..
ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా పూర్తిగా నిరాశపరచడంతో అభిమానులు కూడా ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో నాయకుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ స్థాయిలో థగ్ లైఫ్ సినిమా ఉండబోతుందని అభిమానులు భావించారు కానీ అభిమానుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత మణిరత్నం విజయ్ సేతుపతితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడి కానుంది.
Also Read: Kamal Hassan -Rajinikanth: ఇట్స్ ఆఫీసియల్.. కమల్ రజనీకాంబో సినిమా ఫిక్స్.. పోస్ట్ వైరల్!