BigTV English
Advertisement

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss Telugu 9 : బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9లో ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు ఇమ్మాన్యూయేల్. అతను స్కిట్ చేసినా, పంచులు వేసినా ప్రేక్షకుల పెదలపై చిరు నవ్వులు విరబుయాల్సిందే. అయితే అప్పుడప్పుడూ ఆ కామెడీ హద్దులు దాటుతుంది అంటూ ఇదే సీజన్లో కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇమ్మూ. కానీ ఈ మధ్య నాగార్జునతో పాటు బిగ్ బాస్ కూడా ఇమ్మూపై పంచుల వర్షం కురిపిస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో ఏకంగా ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ సెటైర్లు పేల్చారు.


ఇమ్మూ హెయిర్ స్టైల్ పై పంచులు

బిగ్ బాస్ హౌస్ లో డే 59 ఎపిసోడ్ లో కూడా కంటెండర్ టాస్క్ లు కంటిన్యూ చేశారు. ఓవైపు సీక్రెట్ టాస్కులు పెడుతూనే, మరోవైపు రెబల్స్ నుంచి కాపాడుకోవడానికి సేఫ్ కార్డ్ టాస్క్ ఆడిస్తున్నారు. అందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను గందరగోళంలో పడేయడానికి ప్రతీ ఒక్కరితో సమాయనుసారం సీక్రెట్ గా ఫోన్లో మాట్లాడుతున్నారు. దీంతో ఎవరికి బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇస్తున్నారో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు కంటెస్టెంట్స్. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇమ్మూతో ఫోన్లో మాట్లాడుతూ రెబల్ ఎవరు అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఇమ్మూ మాట్లాడుతూ సంజన పేరు చెప్పగా, బిగ్ బాస్ “మీరు ఎంతబాగా ఆలోచిస్తున్నారో మీ హెయిర్ స్టైల్ చెబుతోంది” అంటూ సెటైర్ వేశారు. “అవును బిగ్ బాస్. ఈ హౌస్ లోకి వచ్చాక జుట్టు బాగా ఊడిపోతుంది” అంటూ ఇమ్మూ సరదాగా తీసుకున్నారు ఆ కామెంట్స్ ని. అదే మరో సందర్భంలో అయితే ఈ విషయంలో హౌస్ లో పెద్ద రచ్చకు దారి తీసేది. బాడీ షేమింగ్ వంటి సీరియస్ టాపిక్ అయ్యేది.

హౌస్ ను పీడిస్తున్న ఆమ్లెట్ గొడవ

ఈ సీజన్ మొదట్లోనే సంజనా గుడ్లను దొంగిలించి తినడంతో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ‘గుడ్డు పోయిందా ?’ అనే మీమ్స్ తో దాన్ని ఆడియన్స్ తేలికగా తీసుకున్నారు. కానీ హౌస్ మేట్స్ మాత్రం సీరియస్ గా ఆ గుడ్డు గోలను కంటిన్యూ చేస్తున్నారు. అదే గుడ్డు గోడవను వైల్డ్ కార్డ్స్ కూడా వాడుకున్నారు నామినేషన్లలో, చివరి వారం గొడవల్లో కూడా. సర్లే అయ్యిందేదో అయ్యింది అనుకునేలోగా తనూజా తనకు కూడా భరణికి ఆమ్లెట్ వేశాడని రీసెంట్ ఎపిసోడ్ లో డెమోన్ పై అలిగింది. ఇప్పుడు నిఖిల్ కు ఆమ్లెట్ వేయడానికి గౌరవ్ అందుబాటులో లేకపోవడం మరో రచ్చకు దారి తీసింది. ఈ సీజన్ ముగిసేదాక గుడ్డు వాళ్ళను వదిలినా, వాళ్ళు గుడ్డును వదిలేలా లేరు.


Read Also ; దివ్య, సుమన్ శెట్టి సుద్దపూస వేషాలు… హౌస్ మేట్స్ కన్నింగ్ ప్లాన్ కు డెమోన్ బలి… గౌరవ్ పై నోరు పారేసుకున్న దివ్య

Related News

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Bigg Boss 9 Telugu Day 59 : దెయ్యాల వేట – రీతూ ఆట… హౌస్ మేట్స్ కన్నింగ్ ప్లాన్ కు డెమోన్ బలి… గౌరవ్ పై నోరు పారేసుకున్న దివ్య

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Big Stories

×