Anchor Ravi : తెలుగు బుల్లి తెర పై మేల్ యాంకర్స్ లలో మొదటగా వినిపించేపేరు యాంకర్ ప్రదీప్.. ఆ తర్వాత రవి పేరు వినిపిస్తుంది. ఈయన చేస్తున్న ప్రతి షో మంచి హిట్ ను అందుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. బుల్లి తెర పై పలు షోలకు హోస్ట్ గా వ్యవహారిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. రవి సాయం కావాలని అడిగిన వారికీ తోచిన సాయం చేస్తాడు. ఇక సోషల్ మీడియాలో రవికి హీరోకు ఉన్న ఫాలోయింగ్ ఉంది. హైపర్ యాక్టివ్ ఉంటాడు. తన ప్రోఫిషినల్ లైఫ్ తో పాటుగా ఫ్యామిలీ గురించి షేర్ చేసుకుంటాడు. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన మనిషి అనుకున్నావాడే తనని నమ్మించి మోసం చేశాడని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.
యాంకర్ రవి కేరీర్ విషయానికొస్తే.. సమ్‌థింగ్ స్పెషల్ అనే షోతో తెలుగు వారిని పలకరించారు. ముఖ్యంగా యాంకర్ లాస్య జోడీగా చేసిన ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ షోలో యాంకర్స్ క్లోజ్ గా ఉండటంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఎదో ఉందనే వార్తలు వినిపించాయి. కానీ రవి మాత్రం సీక్రెట్ గా పెళ్లి చేసుకొని భార్యను, కూతురిని పరిచయం చేసాడు. బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడని అనుకున్నప్పటికీ.. అనుకోని విధంగా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు..
ఇకపోతే యాంకర్ రవి ఎప్పుడు ఏదోక ఇంటర్వ్యూ లో పాల్గొంటాడు. తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో రవి గతంలో తాను అసిస్టెంట్ చేతిలో మోసపోయినట్లుగా చెప్పాడు. ఇండస్ట్రీలో అసిస్టెంట్‌ల ను నమ్మాల్సిన పరిస్ధితి ఉంటుందని.. ఇంటి నుంచి బయల్దేరినప్పుడు కాస్ట్యూమ్స్, నా బ్యాగ్, నా కారు కీ, నా రూమ్ కీస్ అన్ని అతని వద్దే ఉంటాయని తెలిపాడు.. ఒకరోజు తన అసిస్టెంట్ రాకపోవడంతో లక్ష్మణ్ అనే వ్యక్తిని రమ్మని చెప్పాడట.. ఇక పెట్రోల్ బంక్ దగ్గర డ్రైవర్‌కి కార్డ్ ఇచ్చి పిన్ నెంబర్ చెప్పేవాడినని.. ఈ పిన్ నెంబర్‌ను లక్ష్మణ్ నోట్ చేసుకున్నాడని అన్నాడు. నా పర్స్ ఎప్పుడూ నా కారులోనే ఉంటుందని, రెండు ఏటీఎం కార్డ్స్ కొట్టేశాడని.. ఓ రోజు ఉదయం 50 వేలు డబ్బులు కట్ అయినట్లుగా మెసేజ్ రావడంతో నేను నేరుగా బ్యాంక్ కు వెళ్లి కనుక్కోగా సీసి టీవీ పుటేజ్ లో లక్ష్మణ్ కనిపించాడు. అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్న కానీ పోనిలే అని వదిలేసాను. అతని జీవితం స్పాయిల్ అవుతుందని వదిలేసాను అని రవి అన్నాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ప్రస్తుతం రవి బుల్లి తెర పై పలు షోలకు యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.