Bigg Boss 9 : ఫైర్ స్ట్రోమ్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు గౌరవ గుప్తా. అయితే అతనికి తెలుగు లాంగ్వేజ్ సరిగ్గా రాదు. తనకి తెలుగు నేర్పించే బాధ్యతను ఆయేషాకి అప్పజెప్పారు. ఆయేషా కొన్ని ఆరోగ్య కారణాల వలన హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. గౌరవ్ పెద్దగా హౌస్ లో మాట్లాడడు. గౌరవ్ కు కొంతమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.
హౌస్ లో ఎప్పుడూ మాట్లాడని గౌరవ్ ఈరోజు ఫైర్ అయ్యాడు. కిచెన్ విషయంలో గొడవపడ్డాడు. మీ ఆర్గ్యుమెంట్లో వచ్చిరాని తెలుగులో ఇది అన్నందుకు దివ్య బాగా ఫీల్ అయిపోయింది. చాలా సందర్భాలలో వాడు అనేసింది. గౌరవ ఆటను గమనించేవారికి ఇది మంచి హై అని చెప్పొచ్చు. ఎలిమినేషన్ నుంచి లాస్ట్ వారమే సేవ్ అయిపోయాడు. ఇప్పుడు తన అసలైన ఆట చూపిస్తున్నాడు అనుకోవచ్చు.
ఒక ఐదు నిమిషాలు ఆమ్లెట్ కోసం వెయిట్ చేయలేకపోయారు. కానీ నేను 5 డేస్ మిల్క్ లేకుండా ఉండాలి. అయితే రేషన్ మేనేజర్ కన్నా కూడా నాదే పెద్ద మిస్టేక్. అంటూ గౌరవ్ మాట్లాడాడు. దీనితో ఒక్కసారిగా రీతు కూడా రెచ్చిపోయే ప్రయత్నం చేసింది వీళ్ళ మధ్యనే హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. కెప్టెన్ గా తనుజ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది గాని గౌరవం అంత ఈజీగా లొంగలేదు.
చాలామంది కెప్టన్ చెప్పే మాటలను వింటారు. ఒకవేళ కెప్టెన్ మాట వినకపోతే వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున వార్నింగ్ ఇస్తారు అని ఇప్పటివరకు చాలామంది భయపడ్డారు. కానీ కెప్టెన్ మాట వినను అని డైరెక్ట్ గా చెప్పేసాడు గౌరవ్. ఇప్పటివరకు సీజన్ లో అలా చెప్పిన వాళ్ళు లేరు. ఈ విషయం పై వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఏమి మాట్లాడుతారో అని ఆసక్తి నెలకొంది. మరోవైపు గౌరవ గేమ్ కూడా స్టార్ట్ చేశాడు అనే ఫీలింగ్ కలుగుతుంది.
Also Read: Pawan Kalyan: స్టైలిష్ పొలిటీషియన్, ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే ఈ లుక్స్?