BigTV English
Advertisement

Raviteja: అప్పుడు హరీష్ శంకర్, ఇప్పుడు భాను భోగవరపు, రవితేజ మళ్ళీ ఆదుకుంటాడా?

Raviteja: అప్పుడు హరీష్ శంకర్, ఇప్పుడు భాను భోగవరపు, రవితేజ మళ్ళీ ఆదుకుంటాడా?

Raviteja : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి తర్వాత నటుడుగా కొన్ని సినిమాల్లో కనిపించాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న అప్పటి నుంచే పూరి జగన్నాథ్ రవితేజను ఉద్దేశిస్తూ నిన్ను హీరోని చేస్తాను అని అంటూ ఉండేవాడు. రవితేజ ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు.


కానీ కొన్ని రోజుల తర్వాత పూరి జగన్నాథ్ చేసిన సూపర్ హిట్ సినిమాలలో రవితేజ భాగం అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. అయితే వీరిద్దరూ కలిసి చేసిన దేవుడు చేసిన మనుషులు ఊహించిన సక్సెస్ సాధించలేదు.

అప్పుడు హరీష్ ఇప్పుడు భాను 

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన రవితేజ చాలామంది దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. రవితేజ పరిచయం చేసిన దర్శకులు అంతా కూడా ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. బాబీ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.


గోపిచంద్ మలినేని బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. మరోసారి బాలకృష్ణ నటించబోయే 111వ సినిమాకి కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు. ఇక రీసెంట్ గా మాస్ జాతర సినిమాతో భాను బోగవరపు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు.

గతంలో హరీష్ శంకర్ దర్శకుడిగా పరిచయమైన షాక్ సినిమా ఊహించని షాక్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత మళ్లీ రచయితగా పనిచేశాడు హరీష్. మళ్లీ మిరపకాయ్ సినిమాకి రవితేజ అవకాశం ఇచ్చాడు ఆ సినిమా సక్సెస్ కావడంతో ఇండస్ట్రీలో నిలబడిపోయాడు.

రవితేజ ఆదుకుంటాడా? 

గతంలో హరీష్ శంకర్ కు కొన్ని సినిమా అవకాశాలు వచ్చి కూడా వెనక్కు వెళ్లిపోయాయి. ఆ తరుణంలో రవితేజ మళ్ళీ హరీష్ కు డేట్స్ ఇచ్చారు. ఒక దర్శకుడుగా ఇండస్ట్రీలో నిలబెట్టారు. ఇప్పుడు భానుకి కూడా మరో అవకాశం ఇస్తారా? లేకపోతే భాను తన సొంత ప్రయత్నాలతో వేరే హీరోతో సినిమా చేసి సక్సెస్ అందుకుంటాడా అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది.

Also Read: Mani Ratnam: మణిరత్నం ను రిజెక్ట్ చేసిన శింబు, థగ్ లైఫ్ ఎఫెక్ట్

Related News

Chinmayi : ఇలాంటి మగాళ్లు చచ్చిపోవాలి చిన్మయి షాకింగ్ కామెంట్స్ 

Vijay Sethupathi: మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతి.. అప్పుడే షూటింగ్!

Mani Ratnam: మణిరత్నం ను రిజెక్ట్ చేసిన శింబు, థగ్ లైఫ్ ఎఫెక్ట్

Telugu industry : పచ్చళ్ళ పాప రియాలిటీ షో కంటెస్టెంట్, పూసల పాప హీరోయిన్ అంతా సోషల్ మీడియా పుణ్యమే

Akhanda 2  Update: అఖండ ఫస్ట్ సింగిల్ సిద్ధం, దీని కోసమే తమన్ రాజా సాబ్ పక్కన పెట్టేసాడా? 

Kamal Hassan -Rajinikanth: ఇట్స్ ఆఫీసియల్.. కమల్ రజనీకాంబో సినిమా ఫిక్స్.. పోస్ట్ వైరల్!

Balakrishna: ఫ్యాన్స్ కి షాక్ … ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేసిన బాలయ్య!

Big Stories

×