BigTV English
Advertisement

Deputy CM Bhatti: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి

Deputy CM Bhatti: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి

Deputy CM Bhatti: వరల్డ్ క్లాసు ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి తెలుగు క్లబ్ లో సినీ రంగ ప్రముఖులు, శ్రీరంగ కార్మిక నాయకుల సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ నాడు ఉమ్మడి రాష్ట్రంలో నేడు ప్రత్యేక రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాల ఆధ్వర్యంలో నే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.


వేలాదిమంది సినీ కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి, చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాద్ రప్పించడానికి సినీ స్టూడియోలు నిర్మించేందుకు ప్రభుత్వమే భూములు ఇచ్చిందని వివరించారు. ఒక అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు తదితరసిని స్టూడియోలు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రారంభం అయ్యాయని వివరించారు. ఫిలిం క్లబ్ కు స్థలం సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరిగిందని అన్నారు. సినీ కార్మికుల కోసం సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ ఏర్పాటు కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడిగిమరీ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా ఎలాంటి వినతి వచ్చినా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

హైదరాబాద్ గొప్పనగరం అన్ని భాషల వారిని అక్కున చేర్చుకుంటుందని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చక్కటి వాతావరణం తక్కువ ధరకే మానవ వనరులు లభ్యత హైదరాబాద్ కే సొంతం అన్నారు. సినీ పరిశ్రమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి సందర్భంలో నూ నిలబడ్డాయి అన్నారు భవిష్యత్తులోనూ నిలబడతాయని తెలిపారు. సినీ పరిశ్రమ బాగా ఎదగాలి ఎంత ఎదిగితే అంతమందికి ఉపాధి తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.


సినీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో ఎదగాలంటే ఈ ప్రభుత్వం బలంగా ఉండాలి ఈ ప్రభుత్వం బలంగా ఉంటేనే సినీ పరిశ్రమ బాగా ఎదుగుతుందని తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. మా అసోసియేషన్ కార్యాలయం నిర్మాణానికి స్థలం విషయంలో ఎఫ్డిసి చైర్మన్ తో మాట్లాడి ఆ కలను ప్రభుత్వం సహకారం అయ్యేలా ప్రయత్నం చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మంచి సినిమాలు రావాలి. చిన్న సినిమాలు కూడా రావాలని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ జిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: CM Revanth Reddy: జూబ్లీలో మోదీ, కేసీఆర్ ఓవైపు.. రాహుల్ గాంధీ నేను ఓవైపు.. ఇక తాడోపేడో తేల్చుకుందాం: సీఎం రేవంత్

Related News

Jubilee hills elections: జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత మాది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills bypoll: కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు.. చలో ఏదో ఒకటి తేల్చుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి

Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Nagarkurnool: కల్వకుర్తిలో దారుణం.. వివాహేతర సంబంధం నెపంతో ఒకే కుటుంబంపై వేట కొడవళ్లతో దాడి

CM Revanth Reddy: జూబ్లీలో మోదీ, కేసీఆర్ ఓవైపు.. రాహుల్ గాంధీ నేను ఓవైపు.. ఇక తాడోపేడో తేల్చుకుందాం: సీఎం రేవంత్

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Big Stories

×