ANR National Award 2024: అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు 2024 వేడుకలు ఈరోజు..అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు.
ఏఎన్నార్ ప్రవేశపెట్టిన ఈ అవార్డు కార్యక్రమాన్నిఆయన వారసులు కొనసాగిస్తున్నారు. అక్కినేని కుటుంబం మొత్తం కలిసి ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించింది.
ఏఎన్నార్ నేషనల్ అవార్డును 2024 సంవత్సరానికి గాను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఈ వేడుకలో అక్కినేని వారసులు సందడి చేశారు. ముఖ్యంగా నాగచైతన్య నేవి బ్లూ సూట్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు.
ఇక ఈవెంట్ మొత్తంలో చాలా సైలెంట్ గా కనిపించాడు.. అఖిల్ అక్కినేని.. బ్లాక్ కలర్ డిజైనర్ సూట్ లో అఖిల్ లుక్ అదిరింది.
ఇక ఏఎన్నార్ అవార్డు ఈవెంట్ కు ముఖ్య అతిథి అంటే అమితాబ్ బచ్చనే. ఆయన గురించి నాగ్ ఎంతో గొప్పగా ప్రసంగించాడు. ఈ ఈవెంట్ కు ఆయన రావడం ఆనందంగా ఉందని తెలిపాడు.
ఇక కింగ్ విషయానికొస్తే బ్లాక్ అండ్ బ్లాక్ సూట్.. గాగుల్స్ తో ఈవెంట్ మొత్తానికి హైలైట్ గా నిలిచాడు.
సీనియర్ నటి రమ్యకృష్ణ బ్లాక్ కలర్ చీరలో కనిపించింది. ఏఎన్నార్ తో ఆమె మంచి సినిమాలే చేసింది. ఆయన చివరి వీడియో చూసి రమ్యకృష్ణ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక ఈవెంట్ లో రామ్ చరణే సెంట్రాఫ్ ఎట్రాక్షన్.. హాస్య బ్రహ్మా బ్రహ్మానందం పక్కన కూర్చొని.. ఆయన చెప్పే జోకులకు పగలబడి నవ్వుతూ ఇదుగో ఇలా కెమెరా కంటికి చిక్కాడు.
న్యాచురల్ స్టార్ నాని సైతం ఈవెంట్ లో సందడి చేశాడు. నాగ్ తో కలిసి నాని దేవదాసు సినిమాలో నటించాడు. అప్పటినుంచి వీరి మధ్య బంధం బలపడింది.
ఇక అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ సూట్ లో అదిరిపోయారు. ఏఎన్నార్ అవార్డు తీసుకోవడం తనకెంతో ప్రత్యేకమని, ఈ అవార్డు కన్నా తనకు ఏది ఎక్కువ కాదని అన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో గుబురు గెడ్డంతో చాలా అందంగా కనిపించాడు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం బ్లాక్ అవుట్ ఫిట్ లో చాలా హుందాగా కనిపించారు. సౌత్ ఇండస్ట్రీలో పనిచేయడం చాలా గర్వంగా ఉందని ఆయన తెలిపారు.
కల్కి సినిమాతో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. కుటుంబంతో సహా ఈవెంట్ లో పాల్గొన్నాడు. వైజయంతీ మూవీస్ కు, నాగ్ కు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటినుంచో వీరి బంధం కొనసాగుతూ వస్తుంది.
ఇక ఈవెంట్ కు వచ్చిన అందరి కళ్లు కొత్త జంట మీదనే ఉన్నాయి. అక్కినేని నాగచైతన్య- శోభితా వివాహం త్వరలోనే జరగనున్న విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ లో చై పక్కన శోభితా భార్య స్థానంలో నిలబడింది.
ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుకల్లో శోభితానే.. అక్కినేని కోడలి హోదాలో కనిపించింది. చీరకట్టుతో ఆమె ఎంతో అందంగా కనిపించింది.