Serial Heroine : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అనేవి కామన్.. ఒకప్పుడు సినిమా హీరో హీరోయిన్లు ప్రేమలో పడ్డారు ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకున్నారు అని అనుకునేవారు. కానీ ఈ మధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తున్న హీరో హీరోయిన్లు కూడా ప్రేమలో పడి కొంతకాలం సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో జంటలు అలా ఒక్కటయ్యారు. కొంతమంది జీవితం సాఫీగా సాగుతుంటే.. మరి కొంతమంది మాత్రం తమ భాగస్వామితో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. సీరియల్ లో నటించిన ప్రేక్షకుల మనసును దోచుకున్న ఓ బుల్లితెర నటి ప్రేమించి పెళ్లి చేసుకుంది. సీక్రెట్ గా చేసుకున్న పెళ్లి ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. భర్త నుంచి విడాకులు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎంతో ఇష్టంగా చేసుకున్న ఆ పెళ్లిని పెటాకులు ఎందుకు చేస్తుందో అన్నది చాలామందికి తెలియదు.. సీరియల్ హీరోయిన్ ఎవరు? పెళ్లి తర్వాత ఆమె విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సినిమా ఇండస్ట్రీలో మాత్రమే విడాకుల మాట వినిపిస్తుందని అందరు అనుకుంటున్నారు. ఈ మధ్య బుల్లితెర ఇండస్ట్రీలో కూడా అలాంటి మాట వినిపిస్తుంది.. సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలు చెరగని ముద్ర వేసుకున్న సీరియల్ హీరో హీరోయిన్లు చాలామంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతమంది పెళ్లయిన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. అలాంటి వారిలో సీరియల్ హీరోయిన్ ప్రియాంక నల్కరీ ఒకరు.. బుల్లితెరతో పాటు పలు సినిమాలు కనిపించి, తన నటనతో మెప్పించిన ఈ బ్యూటీ.బాలనటిగా పలు సీరియళ్లలో నటించింది ప్రియాంక. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా పలు సీరియల్స్లలో నటించింది. ఓ అబ్బాయిని ప్రేమించి సీక్రెట్‌గా పెళ్లిచేసుకుంది ప్రియాంక. మలేషియాలోని మురుగన్ అలయంలో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే భర్తతో విడాకులు తీసుకుందని వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో ఆమెకు ఈ విషయం పై ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఆమె అవుననే సమాధానం చెప్పింది. కానీ ఎందుకు విడాకులు తీసుకుందో వివరించలేదు.
Also Read : ఆదివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
తెలుగు బుల్లితెర హీరోయిన్ ప్రియాంక నల్కరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై పరిచయమైన ఈ అమ్మడు హీరోయిన్గా ఎన్నో సీరియల్స్లలో నటించింది. అంతేకాదు చెల్లెలుగా కోడలుగా ప్రత్యేక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా సీరియల్స్ చేసింది. ఈమె నటనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉందని మాత్రమే తెలుస్తుంది.. మరి విడాకులు తీసుకుందా లేదా అన్నది క్లారిటీగా చెప్పలేదు. పెళ్లి తర్వాత ఏమైనా సీరియల్స్లలో పెద్దగా కనిపించలేదు.. ప్రస్తుతం ఈమె తమిళ సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉందని తెలుస్తుంది..