Ram Charan: ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ల ప్రస్తావన వస్తే చాలా మంది ఖచ్చితంగా చెప్పే పేరు ఏఆర్ రెహమాన్. తెలుగులో ఏఆర్ రెహమాన్ పెద్దగా సినిమాలు చేయకపోయినా కూడా చాలా డబ్బింగ్ సినిమాలు ద్వారా ఆయన మ్యూజిక్ పరిచయం. ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ఎంత మాట్లాడినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అందుకే బుచ్చిబాబు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ మీ బొంబాయి సినిమా పాటలు అంటే నాకు చాలా ఇష్టం సార్ మా అన్నయ్య ఒకసారి క్యాసెట్ తీసుకొచ్చి ఈయన బాగా కొడతాడు అని చెప్పాడు.
అనే విషయాన్ని స్వయంగా ఏఆర్ రెహమాన్ తో బుచ్చిబాబు చిక్రి సాంగ్ అనౌన్స్మెంట్ అప్పుడు చెప్పారు. అయితే బుచ్చిబాబు మాటలను విన్న ఏఆర్ రెహమాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తానికి పెద్ద సినిమా నుంచి చిక్రి అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే. చికిరి పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ పాఠకు సంబంధించిన కొన్ని హుక్ మూమెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏఆర్ రెహమాన్ మెగా కన్సర్ట్ హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ షాట్ లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను చరణ్ ఎంట్రీ కి ఈ ఈవెంట్ లో వాడారు.
రామ్ చరణ్ తేజ్ మాట్లాడుతూ నాకు ఎప్పటినుంచో ఏ ఆర్ రెహమాన్ గారితో పని చేయాలి అని ఉండేది. మొత్తానికి ఒక బెస్ట్ స్క్రిప్ట్ కి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాము అంటూ తన ఒపీనియన్ చెప్పాడు. అయితే రామ్ చరణ్ మాట్లాడిన ఈ మాటల్లో బెస్ట్ స్క్రిప్ట్ అనేది సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది.
ఆల్రెడీ విడుదలైన ఈ లిరికల్ సాంగ్ ను ఆ ఈవెంట్ లో కూడా లైవ్ పెర్ఫార్మన్స్ చేశారు. మొత్తానికి ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాకి హైప్ తీసుకొస్తున్నాడు బుచ్చిబాబు.
మరోవైపు ఈ సినిమా గురించి బయట చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అద్భుతంగా వస్తుంది అని తెలుస్తుంది. అలానే రామ్ చరణ్ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా డిజైన్ చేశాడు బుచ్చిబాబు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్ లో కూడా లొకేషన్స్ చాలా న్యాచురల్ గా అనిపిస్తున్నది. పెద్దగా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఆ సాంగ్ కు సంబంధించి లేదు.
చాలామంది చరణ్ ఉత్తరాంధ్ర యాసను ఎలా మాట్లాడుతాడు అని ఒక క్యూరియాసిటీతో కూడా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
Also Read: Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్