Bigg Boss 9: బిగ్ బాస్ 9 లో ఉన్న అందరి కంటెస్టెంట్లు కంటే కూడా మంచి గుర్తింపు సాధించుకుని వ్యక్తి సుమన్ శెట్టి. గతంలో ఎన్నో సినిమాల్లో సుమన్ శెట్టి నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్నారు. జయం సినిమాలో సుమన్ శెట్టి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7జీ బృందావన్ కాలనీ సినిమాలో కూడా సుమన్ శెట్టి క్యారెక్టర్ ను అంత ఈజీగా మర్చిపోలేము.
అయితే సుమన్ శెట్టి రీసెంట్ టైమ్స్ లో సినిమాల్లో కనిపించడం మానేశారు. అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఈ తరుణంలో బిగ్ బాస్ 9 కంటెస్టెంట్గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సుమన్ శెట్టికి ఇదివరకే గుర్తింపు ఉండడంతో పాటు తాను హౌస్ లో గేమ్ ఆడే తీరు చాలామందికి విపరీతంగా నచ్చింది. కొన్ని విషయాల్లో సుమన్ శెట్టి మాట్లాడే విధానం కూడా ఆకట్టుకుంటుంది. హౌస్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ అంటూ చాలామందికి ఎవరైనా ఉన్నారు అంటే అది సుమన్ శెట్టి మరియు ఇమాన్యులను ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఈవారం వీకెండ్ ఎపిసోడ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎపిసోడ్లో నాగార్జున సుమన్ శెట్టికి ఒక ఆఫర్ ఇచ్చారు. ఎటువంటి టాస్కులు లో పాల్గొనకుండా డైరెక్ట్ గా కెప్టెన్ కోసం కంటెండర్ అయ్యే అవకాశం సుమన్ శెట్టి కు దక్కింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.
బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి ఒక ఫ్యామిలీ వీకెండ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఫ్యామిలీ వీక్ ఎండ్ లో భరణికి సంబంధించిన కుటుంబ సభ్యులు రాకుండా సాగ్రిఫై చేస్తే సుమన్ శెట్టికి అది వస్తుంది. భరణి అభిప్రాయాన్ని నాగార్జున అడిగేలోపే సుమన్ శెట్టి క్లారిటీ ఇచ్చేశాడు.
సర్ ఫ్యామిలీ వీకెండ్ అలానే ఉండనివ్వండి నేను కంటెండర్ కోసం టాస్కులు ఆడుకొని నేను గెలుచుకుంటా. నాకోసం భరణి గారు సాగ్రిఫైజ్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. సుమన్ శెట్టి ఆలోచించే విధానం మరోసారి తనమీద గౌరవాన్ని పెంచేలా చేసింది.
సుమన్ శెట్టి ఆర్ డెసిషన్ చెప్పగానే భరణి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేవలం భరణి మాత్రమే కాకుండా హౌస్ మేట్స్ అంతా కూడా సుమన్ శెట్టి మాట్లాడే విధానానికి ఫిదా అయిపోయారు. మరోవైపు బయటి నుంచి ఆడియన్స్ కూడా సుమన్ శెట్టికి విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు.
నామినేషన్ లో సుమన్ శెట్టి ఉన్నాడు అంటే ఆడియన్స్ అందరూ రంగంలోకి దిగి అద్భుతంగా ఓట్లు వేసి సుమన్ శెట్టిను గెలిపిస్తున్నారు. సుమన్ శెట్టి కూడా రోజులు గడుస్తున్న కొద్ది తన ఆట తీరును మార్చుకుంటూ ముందుకు వెళుతున్నాడు. కచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో సుమన్ శెట్టి కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
Also Read: Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?